Jacqueline Fernandez Nora Fatehi శ్రీలంక సుందరి జాక్వెలైన్ ఫెర్నాండెజ్‌కీ మొరాకో బ్యూటీ నోరా ఫతేహీకీ మధ్య గొడవ ఏంటి.? ఒకరేమో బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్.. ఇంకొకరు హాటెస్ట్ ఐటమ్ బాంబ్.!
మధ్యలోకి సుఖేష్ చంద్రశేఖర్ ఎందుకు వచ్చాడు.? అసలు ఈ సుఖేష్ చంద్రశేఖర్ గొడవేంటి.?
అది రెండు వందల కోట్ల కుంభకోణం.! మనీలాండరింగ్ కేసు.! ఈ కేసులో సుఖేష్ చంద్రశేఖర్ అడ్డంగా దొరికేశాడు. అతని గర్ల్ ఫ్రెండ్ జాక్వైలైన్ ఫెర్నాండెజ్.
Jacqueline Fernandez Nora Fatehi.. ఒకటీ.. రెండూ.!
సుఖేష్ చంద్రశేఖర్‌కి జాక్వెలైన్ ఫెర్నాండెజ్ మాత్రమే కాదు, నోరా ఫతేహీ కూడా గర్ల్ ఫ్రెండే.! సుఖేష్‌కి ఆల్రెడీ పెళ్ళయినా, జాక్వెలైన్‌ని మెయిన్‌టెయిన్ చేస్తున్నాడు. ఇది ఇంకో ట్విస్టు.!
200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో జాక్వెలైన్ ఫెర్నాండెజ్ కూడా ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఇందులోకి నోరా ఫతేహీ పేరు కూడా దూసుకొచ్చింది.

ఇక్కడే అసలు కథ మొదలైంది. జాక్వెలైన్ వర్సెస్ నోరా ఫతేహీ.. ఈ ఇద్దరూ ఇప్పుడు రచ్చకెక్కుతున్నారు.. ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.
కొప్పుల యుద్ధం.. అతని కోసమే.!
‘జాక్వెలైన్ నా స్నేహితురాలు.. నాకూ జాక్వెలైన్‌కీ మధ్య చిచ్చు పెట్టడానికి నోరా ఫతేహీ ప్రయత్నిస్తోంది..’ అని సుఖేష్ ఆరోపిస్తున్నాడు.
అయితే, ‘వాళ్ళిద్దరితో నాకసలు సంబంధం లేదు. వాళ్ళ అక్రమ సంబంధంలోకి నన్ను లాగొద్దు’ అంటోంది నోరా ఫతేహి.
జాక్వెలైన్ మాత్రం, సుఖేష్ చంద్రశేఖర్ బహుమతులు ఇచ్చిన లిస్టులో నోరా ఫతేహీ కూడా వుందని ఆరోపిస్తోంది. జాక్వెలైన్, నోరా ఫతేహి.. ఒకరి మీద ఒకరు పరువు నష్టం దావాలూ వేసుకుంటున్నారు.
Also Read: Anasuya Bharadwaj: అంతకు మించి.!
నిజానికి ఈ ఇద్దరూ కొట్టుకుంటున్నది సుఖేష్ కోసం కాదట.! అతనికి చెందినదిగా చెప్పబడుతున్న కోట్లాది రూపాయల సొమ్ము కోసమట.!
ఒకప్పుడు ఇరువురు భామలు (జాక్వెలైన్, నోరా) కౌగిలిలో సేదతీరినోడు.. ఇప్పుడు జైలు ఊచలు లెక్కెట్టాల్సి వస్తోంది.