Table of Contents
Vishnu Manoj Kannappa Panchayiti.. విష్ణు మంచు నటించి, నిర్మించిన సినిమా కన్నప్ప. కథ నాదే, దర్శకత్వమూ నాదే, నిర్మాణమూ నాదే.. అని చెప్పుకుంటున్నాడు మంచు విష్ణు.!
సినిమా విడుదలకు సిద్ధమైంది. ప్రభాస్, మోహన్‌బాబు, అక్షయ్ కుమార్, మోహన్ లాల్.. ఇలా ప్రముఖ తారాగణం ఈ ‘కన్నప్ప’ సినిమాలో నటించారు.
విడుదలకు సిద్ధమైన ‘కన్నప్ప’ సినిమాకి ఆల్ ది బెస్ట్ చెప్పాడు మంచు మనోజ్. ఈ సందర్భంగా మోహన్‌బాబు, ప్రభాస్, అక్షయ్ కుమార్.. తదితర పేర్లన్నీ మంచు మనోజ్ తన ట్వీటులో ప్రస్తావించాడు.
Vishnu Manoj Kannappa Panchayiti.. మంచు విష్ణుని మనోజ్ గుర్తించడంలేదా.?
‘కన్నప్ప’ సినిమాలో హీరో ఎవరు.? ఇంకెవరు, మంచు విష్ణు. ‘కన్నప్ప’ సినిమాకి కర్మ, కర్త, క్రియ.. అన్నీ మంచు విష్ణు.. అని అందరికీ తెలుసు.
కానీ, ‘కన్నప్ప’ టీమ్ గురించి ప్రస్తావిస్తూ, మంచు విష్ణు పేరుని మంచు మనోజ్ తన ట్వీటులో లైట్ తీసుకున్నాడు. ఇదిప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

మంచు మనోజ్ విషెస్ చెబితే, ‘కన్నప్ప’ సినిమాకి అదనంగా రెండు టిక్కెట్లు అయినా పెరుగుతాయా.? చెప్పకపోతే, ఓ రెండు టిక్కెట్లు అయినా తగ్గుతాయా.?
అన్నదమ్ముల పంచాయితీ..
గత కొన్నాళ్ళుగా మనోజ్ – విష్ణు మధ్య పంచాయితీ నడుస్తోంది. హత్యాయత్నం.. ఆరోపణలూ తెరపైకొచ్చాయి. విష్ణుకి అండగా మోహన్‌బాబు నిలబడ్డారు.
‘ఈ జన్మకి మోహన్‌బాబే నా తండ్రి’ అంటున్నాడు మనోజ్. ఆస్తుల పంపకాల వ్యవహారం ముదిరి పాకాన పడింది. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు.
సిల్లీగా జనరేటర్‌లో పంచదార కూడా పోసుకున్న ఘటన చూశాం.. మంచు కుటుంబ కథా చిత్రంలో.
హార్డ్ డిస్క్ ఏమయ్యింది.?
ఇప్పుడేమో, సినిమా పంచాయితీ.! మనోజ్‌ని విష్ణు లైట్ తీసుకుంటాడన్నది నిర్వివాదాంశం.. సినిమా వరకూ.! అన్నట్టు, సినిమాకి సంబంధించిన హార్డ్ డిస్క్ లీక్ అయ్యిందని విష్ణు ఆ మధ్య రచ్చ చేశాడు.
Also Read: AI సిత్తరమ్.! సినిమాకి ‘హీరోయిన్ గ్లామరు’తో పనేముంది.?
ఆ డిస్కుని మనోజ్ లీక్ చేస్తాడని కూడా విష్ణు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇంతలోనే, మనోజ్ నుంచి సినిమా రిలీజ్ ముందర ‘ఆల్ ది బెస్ట్ కన్నప్ప’ అంటూ ట్వీటు.!
ఇదింతే.. మంచు ముచ్చట ఇంతే.. ఇది మారదంతే.! ఇదెవరికీ అర్థం కాని పంచాయితీ అంతే.!