Jagan Sharmila Money Politics.. రాజకీయంగా తనతో విభేదించిన వారిపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతలా పగతో రగలిపోతారో చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే.
ఆమె స్వయానా తోడబుట్టిన చెల్లెలు. పేరు తెలుసు కదా.. వైఎస్ షర్మిల రెడ్డి. కాదు కాదు, వైఎస్ జగన్ దృష్టిలో మెరుసుపల్లి షర్మిల శాస్త్రి మాత్రమే.
అంతే, తనకు మద్దతిస్తే షర్మిలని రెడ్డి అంటారు.. లేదంటే, శాప్త్రి.. అంటారు. ఇదీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వరస.!
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు తెలుసు కదా.? తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు, ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొడుకు జగన్ అక్రమాస్తులు కూడగట్టారన్నది ప్రధాన అభియ్గోగం.
Jagan Sharmila Money Politics.. ప్రేమతో ఆస్తుల్లో వాటాలు రాసిచ్చి..
ఈ కేసులోనే వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సీబీఐ గతంలో అరెస్ట్ చేసింది, వైఎస్ జగన్ 16 నెలలు జైల్లో వున్నారు. ఇప్పటికీ ఆ కేసులో బెయిల్ మీదనే వున్నారు.
అలా సంపాదించిన అక్రమాస్తుల్ని వాటాలు వేసుకునే క్రమంలో జగన్ సహా విజయమ్మ, షర్మిల మద్య వచ్చిన అభిప్రాయ బేధాలు, గొడవలు.. వెరసి, వ్యవహారం కోర్టుకు ఎక్కిందన్నమాట.
అప్పట్లో షర్మిల మీద ప్రేమాభిమానాలతో వాటాలు రాసిచ్చాననీ, రాజకీయంగా తనతో విభేదించాక.. ఆమెకు తన ఆస్తుల్లో వాటాలు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాననీ కోర్టుకు తాజాగా తెలిపారు వైఎస్ జగన్.

ఇదే వాదనను గతంలోనూ వైఎస్ జగన్ న్యాయస్థానం ముందర వివరించిన సంగతి తెలిసిందే. తన కుమారుడి తీరుపై విజయమ్మ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అధికారంలోకి వచ్చాక వైఎస్ జగన్, అప్పటిదాకా తనకు అండగా వున్న తల్లి విజయమ్మనీ, చెల్లెలు షర్మిలనీ.. పార్టీకి దూరం పెట్టిన సంగతి తెలిసిందే.
వైఎస్ షర్మిల తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించారు. కుమార్తెకు అండ దండగా వుండేందుకు షర్మిల వెంట నడిచారు విజయమ్మ.

ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల పని చేస్తున్నారు. విజయమ్మ మాత్రం, రాజకీయాలకు దూరంగా వున్నారు. రాజకీయంగా విజయమ్మ మద్దతు మాత్రం షర్మిలకే.
ఇదే జీర్ణించుకోలేకపోతున్నారు వైఎస్ జగన్.! మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేనంటాడో మహానుభావుడు. బహుశా జగన్ లాంటి వాళ్ళ కోసమే ఆ మాట చెప్పి వుంటాడు.
కన్న తల్లితో ఆస్తుల పంచాయితీ.. అంటే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఏమనాలి.?
