ప్రత్యర్థులు మాత్రమే.! శతృవులు కాదు: పవన్ కళ్యాణ్

 ప్రత్యర్థులు మాత్రమే.! శతృవులు కాదు: పవన్ కళ్యాణ్

Pawan Kalyan Jana Sena Party

Pawan Kalyan Jagan Rivals.. ఔను కదా.! రాజకీయాల్లో ప్రత్యర్థులు మాత్రమే వుండాలి.! శతృవులు ఎందుకు వుంటారు.? దురదృష్టం, ఇప్పుడు రాజకీయం అంటే శతృత్వం మాత్రమే.!

ఎంత శతృత్వం పెంచుకోకపోతే, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యల్ని ముఖ్యమంత్రి హోదాలో వుండీ వైఎస్ జగన్ చేయగలుగుతారు.?

మరి, పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం కదా.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేవలం ఎమ్మెల్యే మాత్రమే.! జగన్‌ని పవన్ ఏమైనా అనొచ్చు కదా.?

Pawan Kalyan Jagan Rivals.. రాజకీయమంటే సంస్కారం కూడా.!

రాజకీయమంటే సేవ, బాధ్యత.. అంతే కాదు, సంస్కారం కూడా.! ఆ మాత్రం సోయ లేకుండా పోయింది 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలు, 22 లోక్ సభ సీట్లు గెలిచిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.

కానీ, 2024 ఎన్నికల్లో కేవలం 21 అసెంబ్లీ 2 పార్లమెంటు సీట్లు గెలుచుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి మాత్రం సంస్కారం వుంది.!

Pawan Kalyan Ys Jagan Pawan Kalyan Jagan Rivals
Pawan Kalyan Ys Jagan

అందుకే, రాజకీయమంటే శతృత్వం కాదు. రాజకీయాల్లో ప్రత్యర్థులు మాత్రమే వుంటారు, శతృవులు కాదు.. అని తాజాగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

రాజకీయ ప్రత్యర్థుల్ని దూషించొద్దు..

‘ఓడిపోయినంత మాత్రాన వాళ్ళని దూషించొద్దు.. రాజకీయ విమర్శలు వేరు, వ్యక్తిగత దూషణలు వేరు..’ అంటూ, పార్టీ శ్రేణులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచించారు.

కుళ్ళిపోయిన రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలంటే, పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు ఇంకా బలంగా వుండాలి. ఆ బలాన్ని ప్రజలే ఇవ్వాలి.

Also Read: అంబటి కొత్త ఇన్నింగ్స్.! ఆ బౌన్సర్లని

అసలంటూ, రాజకీయం అంటేనే ప్రజా సేవ. ఎవరెక్కువ ప్రజా సేవ చేస్తారన్నదాంట్లో పోటీ పడాలి, ప్రత్యర్థులుగా నిలబడి.. ఒకరికంటే ఘనులు ఇంకొకరనిపించుకోవాలి.

అంతేగానీ, ఈ రాజకీయ శతృత్వమేంటి.? ఈ దిగజారుడుతనమేంటి.? చేసిన తప్పులకి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బేషరతుగా పవన్ కళ్యాణ్‌కి క్షమాపణ చెబితే, అదీ హుందాతనం అవుతుంది.!

Digiqole Ad

Related post