Table of Contents
Jailer Movie Review.. రజనీకాంత్ సినిమాలు ఎప్పుడొచ్చినా పెద్ద సెన్సేషనే. రిలీజ్‌కి ముందే రికార్డులు కొల్లగొట్టేస్తుంటాయ్. అయితే, ‘జైలర్’ విషయంలో కాస్త ఆచి తూచి వ్యవహరించినట్లున్నారు మేకర్లు.
ఎందుకంటే, ఈ మధ్య రజనీకాంత్ నుంచి వస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొడుతున్న సంగతి తెలిసిందే.
సో, ‘జైలర్’పై అంచనాలున్నప్పటికీ కాస్త గోప్యత పాఠించారు. ఎట్టకేలకు సినిమా రిలీజ్ అయ్యింది. మరి ‘జైలర్’ (Jailer Movie Review) గా రజనీకాంత్ ఎంత మేర ఆకట్టుకున్నాడో తెలియాలంటే, కథలోకి వెళ్లాల్సిందే.
Jailer Movie Review.. రివేంజ్ స్టోరీ.!
రిటైర్డ్ జైలర్ అయిన ముత్తు వేల్ పాండియన్ (రజనీకాంత్), భార్య (రమ్యకృష్ణ), కొడుకు (వసంత్ రవి), కోడలు, మనవడితో శేష జీవితాన్ని సంతోషంగా గడిపేస్తుంటాడు.
కుమారుడు అర్జున్ ఐపీఎస్ ఆఫీసర్‌గా పురాతన దేవాలయాల్లో విగ్రహాల చోరీ చేసే ముఠాని పట్టుకోవడానికి ప్రయత్నించి అకస్మాత్తుగా అదృశ్యమవుతాడు.
అర్జున్ మరణించాడని తెలుసుకున్న ముత్తు, కుమారుడ్ని చంపిన దుండగుల్ని ఒక్కొక్కరినీ చంపుతూ వస్తాడు. ఈ క్రమంలో కొన్ని ఆధారాలు సేకరిస్తూంటాడు ముత్తు.
దాంతో, ముత్తు ఫ్యామిలీ ప్రమాదంలో పడుతుంది. ఆ ప్రమాదం నుంచి ఫ్యామిలీని కాపాడుకోవడానికి ముత్తు ఏం చేశాడు.? కుమారుడ్ని చంపిన వారిపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు.? అనేది మిగతా కథ.
గెస్ట్ అప్పియరెన్స్ ప్లస్ పాయింట్స్
మోహన్ లాల్ (Mohanlal), శివ రాజ్ కుమార్ (Shiva Rajkumar) , జాకీ ష్రాఫ్ తదితర నటీనటులు గెస్ట్ రోల్స్‌లో బాగా నటించారు. ఆ గెస్ట్ రోల్స్‌ని సినిమాకి హైలైట్‌గా తీర్చి దిద్దాడు దర్శకుడు నెల్సన్.
రజనీకాంత్ (Rajini Kanth) బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్లుగా యాక్షన్ సీన్లు అదరగొట్టేశాడు. వాటికి అనిరుధ్ రవిచంద్రన్ ఇచ్చిన ఆర్ఆర్ సూపర్బ్.
హీరోయిన్‌గా తమన్నా(Tamannaah) పాత్రకు పెద్దగా స్కోప్ లేదు. ‘నువ్ కావాలయ్యా’ పాటలో డాన్స్ చితక్కొట్టేసింది తమన్నా. సునీల్ (Sunil) పాత్ర సినిమాకి ఓ సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్.
ఆ విషయంలో ‘జైలర్’ ఫెయిల్.!
రమ్యకృష్ణ (Ramya Krishnan), యోగిబాబు (Yogi Babu) తదితర నటీ నటులు తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. సినిమాటోగ్రపీ బాగుంది. ఎడిటింగ్‌కి పదును పెట్టాల్సిన అంశాలు చాలానే వున్నాయ్.
ఫస్టాఫ్ ఒకింత వేగంగా నడిచినా, సెకండాఫ్ మాత్రం బోర్ కొట్టించేశారు. నెల్సన్ తన గత చిత్రాల్లోని ఎలివేషన్ సీన్లంటినీ మిక్సీలో వేసి కొట్టినట్లున్నాడన్న అభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయ్.
అక్కడక్కడా యాక్షన్ ఎపిసోడ్స్ వావ్ అనిపిస్తాయ్. బోలెడంత ఎమోషన్ కథలో వున్నప్పటికీ, ప్రేక్షకుడ్ని ఆ ఎమోషన్‌కి కనెక్ట్ చేయడంలో ‘జైలర్’ (Jailer Movie Review) విఫలమయ్యాడన్నటాక్ వినిపిస్తోంది.
ఓవరాల్‌గా, ఏడు పదుల వయసులోనూ సూపర్ స్టార్ రజనీకాంత్ ఎంతో ఉత్సాహంగా కనిపించారు. ఆ జోష్‌నీ, ఉత్సాహాన్ని డైరెక్టర్ వాడుకోలేకపోయాడా.? ఇదీ ‘జైలర్’పై ఆడియన్స్ ఒపీనియన్.!