Home » మహోద్యమంలా జన సేన పార్టీ ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదు.!

మహోద్యమంలా జన సేన పార్టీ ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదు.!

by hellomudra
0 comments
Pawan Kalyan

Jana Sena Party Udyami.. ఏ రాజకీయ పార్టీ బలోపేతమైనా, ఆ పార్టీకి వున్న నిఖార్సయిన కార్యకర్తల మీదనే ఆధారపడి వుంటుంది.

సినీ అభిమానుల్ని, జన సైనికులుగా, వీర మహిళలుగా తీర్చిదిద్దడం విషయంలో జన సేనాని పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో విజయం సాధించారు.

పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయిన పరిస్థితుల నుంచి, కోలుకుని.. జన సేన పార్టీని ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఓ బలమైన రాజకీయ పార్టీగా నిలబెట్టగలిగారు పవన్ కళ్యాణ్.

జన సేన పార్టీ సభ్యత్వ నమోదు ఒకింత భిన్నంగా సాగుతోంది మొదటి నుంచీ.. ఇతర రాజకీయ పార్టీలతో పోల్చితే.

Jana Sena Party Udyami.. ఉద్యమంలా ఉద్యమి సభ్యత్వ నమోదు..

ఈసారి ఇంకాస్త భిన్నమైన కాన్సెప్ట్‌తో సభ్యత్వ నమోదుకి తెరలేపారు జన సేనాని పవన్ కళ్యాణ్. కార్యకర్తలకు ‘ఉద్యమి’ అనే పేరు పెట్టారు.

క్రియాశీలక సభ్యులను ఇకపై ‘ఉద్యమి’ అని పిలుస్తారు. ‘ఉద్యమి’గా నమోదయ్యేవారికి సభ్యత్వ రుసుము కూడా తగ్గించారు. మిగతా రాజకీయ పార్టీలతో పోల్చితే, జనసేన క్రియాశీల కార్యకర్తలు చాలా చాలా ప్రత్యేకం.

జన సేన కార్యకర్తలకు ఇన్స్యూరెన్స్ సౌకర్యాన్ని కల్పించడంతోపాటు, కార్యకర్తల్నే నాయకులుగా మలచే విధంగా చర్యలు తీసుకుంటున్నారు జన సేనాని పవన్ కళ్యాణ్.

ఈ క్రమంలో ఈసారి జన సేన క్రియాశీల సభ్యత్వానికి సామాన్యుల నుంచి కూడా స్పందన అనూహ్యంగా కనిపిస్తోంది. ఉద్యమి సభ్యత్వాలు గణనీయంగా పెరుగుతున్నాయి.. గతంతో పోల్చితే.

Also Read: ఆకాశంలో క్రీడీ మైదానం! ఎడారి దేశంలో అద్భుతం!

రెండు తెలుగు రాష్ట్రాల్లో పండగలా ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతోంది. 2029 ఎన్నికల నాటికి మరింత బలమైన రాజకీయ శక్తిగా జన సేన ఎదిగేందుకు, ఈ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉపయోగపడనుంది.

జస్ట్ ఓ సినిమా టిక్కెట్ ధరతో, ఉద్యమి సభ్యత్వం లభిస్తుందంటే, పవన్ కళ్యాణ్ సినీ అభిమానులు.. అలాంటి సభ్యత్వాల విషయంలో ఎందుకు వెనుకడుగు వేస్తారు.?

అటు సినిమాల్ని, ఇటు రాజకీయాన్నీ.. జనసైనికులు బ్యాలన్స్ చేస్తున్న వైనం చూసి, జన సేనాని పవన్ కళ్యాణ్ కూడా గర్వపడతారనడం నిస్సందేహం.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group