Jana Sena Party కోసం ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఓ వాహనం తయారు చేయించుకుంటే, దానికి ఇంతలా ఏడవాలా.?
కడుపుకి అన్నమే తింటున్నారా.? అని అడగాల్సొస్తుంది. రాజకీయ నాయకులెలాగూ రాజకీయాలే చేస్తారు. మీడియా కూడా సిగ్గు లేకుండా రాజకీయాలు చేస్తే ఎలా.?
కక్కుర్తి.! ఇది మామూలు కక్కుర్తి కాదు. ఎంగిలి మెతుకులు ఏరుకునే స్థాయికి ఓ సెక్షన్ మీడియా దిగజారిపోయింది.
కుల జాడ్యమో, ఇంకొకటో.. కారణమేదైతేనేం, ‘జర్నలిజం’ విలువలకు తిలోదకాలిచ్చేసి, పాత్రికేయ వ్యభిచారం చేస్తున్నారు కొందరు.
Jana Sena Party.. వారాహి ఏపీలో ఎందుకు తిరగకూడదు.?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasenani Pawan Kalyan) ‘వారాహి’ (Varahi) పేరుతో ప్రత్యేకంగా ఓ వాహనాన్ని డిజైన్ చేయించుకున్నారు. ఆ వాహనం తాలూకు రంగు విషయమై నానా యాగీ జరిగింది.

రంగుతో అభ్యంతరాల్లేవని చెబుతూ, తెలంగాణలో (Telangana State) ఈ వాహనానికి అధికారులు రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేశారు.
ఏపీలో (Andhra Pradesh) రవాణా శాఖ ఈ వాహనాన్ని అడ్డుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే, దేశవ్యాప్తంగా రవాణా శాఖ నిబంధనలు ఒకటే.. వాహనాల రంగులు, ఇతరత్రా వ్యవహారాలకు సంబంధించి.
తెలంగాణలో ట్యాక్స్ చెల్లిస్తే..
రిజిస్ట్రేషన్ కోసం తెలంగాణలో (Telangana) చెల్లింపులు చేయాలి.. చేశారు కూడా ‘వారాహి’ (Janasena Varahi) వాహనానికి. ప్రైవేటు వాహనం గనుక, ఆంద్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో ప్రత్యేక చెల్లింపులు అవసరం వుండవు.
Also Read: తప్పేముంది.? అది కూడా రీమేకే కదా.?
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో (Andhra Pradesh) ట్యాక్స్ కట్టలేదు గనుక, ఏపీలో ఎలా రాజకీయం చేస్తారు.? అంటూ ఓ సెక్షన్ మీడియా ప్రశ్నిస్తోంది. కాదు కాదు, ఓ బులుగు తాబేదారు ప్రశ్నిస్తున్నాడు.
మతి వుండి మాట్లాడుతున్నారా.? మతి లేకుండా మాట్లాడుతున్నారా.? అన్న ప్రశ్న తెరపైకొస్తోంది. కాదు కాదు, కడుపుకి అన్నమే తింటున్నారా.? అశుద్ధం తింటున్నారా.? అని అడగాల్సి వస్తోంది.
చివరగా.! జనసేన పార్టీకి ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నారు కొందరు.. ఆ పార్టీ మీద నిత్యం అర్థం పర్థం లేని విమర్శలు చేయడం ద్వారా.
మీడియా ప్రశ్నించాల్సిందే.! ఎప్పుడు.. జనసేన పార్టీ వల్ల ప్రజలకు నష్టం కలిగినప్పుడు.! అలా ప్రజలకు నష్టం కలిగించేలా జనసేన వ్యవహరిస్తే, నిలదీయాల్సిందే.. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. అది మీడియా బాధ్యత.