Janasena Chief Pawan Kalyan తెలుగు రాష్ట్రాల్లో జనసేన పార్టీ బలమెంత.? అందునా, ఆంధ్రప్రదేశ్ మీదనే జనసేన స్పెషల్ ఫోకస్ పెట్టింది గనుక, అక్కడ వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీకి రాబోయే సీట్లు ఎన్ని.?
2014 ఎన్నికల సమయంలో జనసేన పార్టీ పుట్టింది. ఆ లెక్కన దాదాపు తొమ్మిదేళ్ళు గడిచిపోయాయ్.! జనసేన పార్టీకి 2019 ఎన్నికల్లో వచ్చింది ఒకే ఒక్క సీటు.
పోటీ చేసిన రెండు చోట్లా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓడిపోయారు 2019 ఎన్నికల్లో.
రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు.! ఉద్ధండులనదగ్గవారు ఓడిపోనూవచ్చు.. అనామకులు గద్దెనెక్కొచ్చు.! చరిత్ర అదే చెబుతోంది. రాజకీయాల్లో మార్పు కోసం జనసేనాని ప్రయత్నిస్తున్నారు.
Mudra369
డబ్బుతో ప్రలోభాలు పెట్టే రాజకీయం చేయనని అంటున్నారు. మరి, జనం మారతారా.? మంచి రాజకీయాల వైపు జనం అడుగులేసి, జనసేనానిని అధికార పీఠమెక్కిస్తారా.?
ఈ కోణంలో చూస్తే, 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జనసేనపై అంచనాల కంటే అనుమానాలే ఎక్కువ కనిపిస్తాయ్.
పొలిటికల్ ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతాయ్..
రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతాయ్. మహామహులే దారుణమైన ఓటమిని చవిచూసిన సందర్భాలు రాజకీయాల్లో కనిపిస్తాయ్.
డబ్బుతో రాజకీయం చేయాలనుకుంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడో చట్ట సభలకు వెళ్ళేవారే. కానీ, ఆయన ఆ కోణంలో రాజకీయాన్ని చూడటంలేదు.
ఒక్కో నియోజకవర్గానికీ 100 కోట్లు ఖర్చు పెట్టకపోతే ఎన్నికల్లో నెగ్గే పరిస్థితి వుండటంలేదు. ఈ రాజకీయాల్లో జనసేనాని మార్పు కోరుకుంటున్నారు. అందుకే గెలుపు ఆలస్యమవుతోంది.
Janasena Chief Pawan Kalyan.. టీడీపీతో పొత్తు సంగతేంటి.?
2024 ఎన్నికలకు సంబంధించి టీడీపీ – జనసేన మధ్య పొత్తు వుంటుందనేది ఓ ప్రచారం. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థి అయితేనే, పొత్తు వుంటుందని జనసేన నేతలు చెబుతున్నారు.
ఒకవేళ పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థిగా టీడీపీ ఒప్పుకుంటే టీడీపీతో పొత్తుకు తామూ సిద్ధమేనని జనసేన మిత్రపక్షం బీజేపీ చెబుతోంది.
ఇంకోపక్క, జనసేన అధినేత గనుక సీఎం అభ్యర్థి అయితే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
Also Read: Money For Sale.. ఇచ్చట డబ్బులు అమ్మబడును.!
‘పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవడం లాంఛనమే..’ అంటూ జనసేన ప్లస్ టీడీపీ మరియు బీజేపీ కాంబినేషన్ గురించిన చర్చ జరుగుతోంది.
కానీ, పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థి అంటే టీడీపీ అధినేత చంద్రబాబు ఒప్పుకుంటారా.? ఏమో, కాలమే సమాధానం చెబుతుందీ ప్రశ్నకి.