Janasena Party 2024 Predictions రాజకీయాల్లో గెలుపోటములు సహజం.! ఓటరు నాడి ఏ క్షణాన ఎలా మారుతుందో చెప్పలేం. అయితే, ఓటరుని ప్రలోభ పెట్టేందుకు రాజకీయ పార్టీలు రకరకాల ప్రయత్నాలు చేస్తూనే వుంటాయ్.!
అయితే, ఆ ‘ప్రయత్నాలు’ ఇప్పుడు జుగుప్సాకరంగా తయారయ్యాయ్.! తండ్రి ఎవరో తెలియని ‘రాజకీయ మైకం’లో ముంచేసి, ‘ఓటు కూలీలు’గా వాళ్ళని మార్చేస్తున్నాయి రాజకీయ పార్టీలు.
2019 ఎన్నికల్లో జనసేన గెలవలేకపోవడానికి కారణం, ఈ ‘రాజకీయ మైకం’ అని నిస్సందేహంగా చెప్పొచ్చు.
ఓటుని ఎంత రేటు పెట్టి అయినా కొనేస్తామంటున్న రాజకీయ పార్టీలు స్వైరవిహారం చేస్తున్న ప్రస్తుత తరుణంలో.. మార్పు కోసం రాజకీయం.. అంటే ఇలాగే వుంటుంది.
Janasena Party 2024 Predictions.. రాజకీయ అసాంఘీక శక్తులు..
2024 ఎన్నికలకు సంబంధించి, ‘ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే..’ అంటూ సర్వేలు చాలాకాలంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.
సర్వేల ముసుగులో ఓటర్ల మెదళ్ళలో విషాన్ని నింపుతోన్న రాజకీయ అసాంఘీక శక్తులు..
Mudra369
ప్రజాస్వామ్య మనుగడకే ముప్పు వాటిల్లేలా సర్వేలు..
లక్షలు కాదు.. కోట్లలో ఖర్చు ఎందుకు సర్వేల కోసం జరుగుతోంది.?
ఆ కోట్లు ఖర్చు చేస్తున్న పార్టీలు, నాయకులు.. జనాన్ని ఎలా పీల్చి పిప్పి చేస్తున్నారు.?
జనం నెత్తిన తమదైన ‘పైత్యాన్ని’ బలవంతంగా రుద్దేందుకు సర్వేల పేరుతో కొన్ని రాజకీయ అసాంఘీక శక్తులు చేస్తోన్న కుట్ర ఇది.
తాజాగా, అలాంటిదే ఓ సర్వే వెలుగు చూసింది. అందులో, ప్రధాన రాజకీయ పార్టీలైన వైసీపీ – టీడీపీ హోరాహోరీ పోరాడబోతున్నాయని పేర్కొన్నారు. జనసేన పార్టీకి సింగిల్ డిజిట్ సీట్లనే కట్టబెట్టారు.

నిజానికి, ఈ తరహా సర్వేలకు సంబంధించి ‘శాంపిల్స్’ విషయమై స్పష్టత వుండదు. డబ్బులిస్తే, ఓట్లనే అమ్మేసుకుంటున్న జనం.. సర్వేల సమయంలో నిజాలెలా చెబుతారు.?
Also Read: వైరల్.! గుండ్రంగా ఎందుకు తిరుగుతున్నాయ్ గొర్రెల్.?
జనసేన ప్రభావం పెద్దగా వుండబోదని ఈ సర్వేల ద్వారా చూపించేసి, జనసైనికుల్లో.. జనసేన నేతల్లో వైరాగ్యాన్ని పెంచాలన్నది సోకాల్డ్ రాజకీయ శక్తుల పన్నాగం.
అలా నైరాశ్యంలోకి వెళ్ళేదే అయితే.. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత జనసేన పార్టీ జెండా మళ్ళీ కనిపించేదా.?