Janasenani Pawan Kalyan KCR ప్రజారాజ్యం పార్టీ పెట్టి టిక్కెట్లు అమ్మేసుకున్నారంటూ మెగాస్టార్ చిరంజీవిని కొందరు రచ్చకీడ్చారు.!
అసలంటూ చిరంజీవికి టిక్కెట్లు అమ్ముకోవాల్సిన అవసరమేంటి.? అన్న ఇంగితం ఎవరికీ లేకుండా పోయింది.
జనసేన పార్టీని స్థాపించి, చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకున్నారు.. అంటూ ఇంకొందరు పవన్ కళ్యాణ్‌ని రోడ్డున పడేసే ప్రయత్నం చేశారు.
వెయ్యి కోట్లంటే చిన్న విషయం కాదు.!
ఈ తుచ్ఛమైన వార్త విషయంలో తెలంగాణ ప్రభుత్వం అత్యంత వేగంగా, అత్యంత కఠినంగా స్పందించాల్సి వుంది.
అదే సమయంలో, ‘ప్యాకేజీ’ ఆరోపణలు చేస్తే చెప్పుతో కొడతానని గతంలో హెచ్చరించిన పవన్ కళ్యాణ్.. మాటల్లో కాదు, చేతల్లో దాన్ని చేసి చూపించాలి.!
Mudra369
పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ప్యాకేజీకి ఎలా అమ్ముడుపోతారు.? అన్న కనీసపాటి సోయ లేనోళ్ళు గత కొంతకాలంగా దుష్ప్రచారం చేస్తూనే వున్నారు.!
Janasenani Pawan Kalyan KCR వెయ్యి కోట్లు.. ఎవడబ్బ సొమ్మనీ.!
జనసేన పార్టీ తరఫున వెయ్యి కోట్లు ఖర్చు చేయడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సిద్ధంగా వున్నారట.!
ఇదిగో, తాజాగా వండి వడ్డిస్తున చెత్త కథనమిది.! పవన్ కళ్యాణ్ కోసం కేసీయార్ ఎందుకు వెయ్యి కోట్లు ఖర్చు చేస్తారు.? అన్న కనీసపాటి ఆలోచన లేకుండా తయారు చేసిన వంటకమిది.!
తమ అవసరాల కోసం ఇంట్లో ఆడాళ్ళని వ్యభిచార కూపంలోకి సైతం దించేందుకు సిద్ధమయ్యేవాళ్ళే ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తారంటూ ‘వెయ్యి కోట్ల ప్యాకేజీ’ కథనాలపై కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు.
తెలంగాణలో ఖర్చు చేసుకోలేరా.? ఏపీలో ఎందుకు.?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్, ముందుగా తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే, ఈ ఏడాదే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి.
అది మానేసి, ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీని గెలిపించడానికి, జనసేన అధినేత ద్వారా ప్యాకేజీ వ్యవహారాలెందుకు మాట్లాడతారు.?
‘తెలంగాణలో మాకు మద్దతిస్తే, వెయ్యి కోట్లు ఇస్తా..’ అని కేసీయార్ గనుక పవన్ కళ్యాణ్‌ని అడిగారన్న ‘వంటకం’ వండితే, ‘ఏమో, గుర్రం ఎగరావచ్చు..’ అని కాస్తయినా అనుకోడానికి వుంటుంది.
Also Read: పవన్ కళ్యాణ్ బ్రహ్మచర్యం.! జాతీయ సమస్యే.?
జర్నలిజం ఏనాడో వ్యభిచారం కంటే నీఛ స్థాయికి పతనమైపోయింది కొందరి కారణంగా. దాన్ని ఇంకా ఇంకా పాతాళానికి తొక్కెయ్యాలనే ప్రయత్నాలే ఇవి.!