Janasenani Pawan Kalyan Security.. చెప్పడానికేం.. చాలా చెబుతారు.! రాజకీయాల్లో హత్యలుండవు.. ఆత్మహత్యలే వుంటాయని.. రాజకీయ నాయకులు చెప్పడం మామూలే.!
ఎందుకు హత్యలుండవ్.? వుంటాయి.! ఇందిరా గాంధీ హత్యకు గురయ్యారు. రాజీవ్ గాంధీ హత్య జరిగింది. చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా చాలా పెద్దదే.!
రాజకీయం అంటే.. అన్నీ వుంటాయ్.! ఆత్మహత్యలే కాదు, హత్యలూ వుంటాయ్.!
జనసేనాని పవన్ కళ్యాణ్‌ని అంతమొందించే కుట్రలు జరుగుతున్నాయ్.. ఇవి స్వయంగా జనసేనాని వ్యక్తం చేస్తున్న అనుమానాలు.!
అభిమానులే ఒకింత అప్రమత్తంగా వుండాలి. కాదు కాదు.. అధినేతని అత్యంత జాగ్రత్తగా కాపాడుకోవాలి.. కంటికి రెప్పలా ఆయన్ని కాపాడుకోవాలి.
Mudra369
తెలుగు రాష్ట్రాల్లోనూ చాలామంది రాజకీయ నాయకులు హత్యకు గురయ్యారు. రాజకీయ ప్రత్యర్థుల్ని అంతమొందించేందుకు రాజకీయ పార్టీలు, నాయకులు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే వుంటారు.
Janasenani Pawan Kalyan Security.. జనసేనాని హత్యకు కుట్ర..
2019 ఎన్నికల సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర జరిగిందట. ఆ విషయాన్ని జనసేనాని స్వయంగా చెప్పారు.

మొన్నటికి మొన్న విశాఖలో జనసేన అధినేత పర్యటిస్తే, ఆయన్ని అంతమొందించేందుకు తెరవెనుక చాలా కథలు నడిచాయట. ఈ విషయాల్ని జనసేనాని స్వయంగా చెప్పడం గమనార్హం.
నిజమే, పవన్ కళ్యాణ్ అంటే కొంతమందికి గిట్టదు. మీడియా ముందరే, ‘చంపేస్తాం’ అని బెదిరిస్తున్నారు కొందరు రాజకీయ నాయకులు నిస్సిగ్గుగా.!
అభిమానులే.. రక్షణ కవచం.!
జనం కోసం జనసేనాని.. ఆ జనసేనానిని రక్షించుకునేందుకు అభిమానులం ఎప్పుడూ రక్షణ కవచంగా వుంటాం.. అని చెబుతున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు.!
Also Read: Free Hindu Temple.! హిందూ దేవాలయాలకి రాజకీయ గ్రహణం.!
2024 ఎన్నికలు మరింత వేడిగా జరగబోతున్నాయ్. ఈ నేపథ్యంలో జనసేనానికి ప్రాణ హాని మరింత ఎక్కువగా వుండే అవకాశాలైతే స్పష్టంగా కనిపిస్తున్నాయ్.
రాజకీయ ప్రత్యర్థులు, పవన్ కళ్యాణ్‌ని అంతమొందించేందుకు సర్వశక్తులూ ఒడ్డే అవకాశం వుందని పవన్ కళ్యాణ్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
ఈ నేపథ్యంలో, అడుగడుగునా ఆయనకు జనసైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు మరింత రక్షణగా నిలబడుతున్నారు.