Table of Contents
Ys Jagan Kallu Moosukuntey.. కన్ను తెరిస్తే జననం.. కన్ను మూస్తే మరణం.! కన్ను తెరవడం గురించీ, కన్ను మూయడం గురించీ.. ఇలా చెప్తుంటాం.
కళ్ళు మూసుకుంటే.. కళ్ళు మూసుకుపోతే.! రెండిటికీ చాలా తేడా వుంది. ‘కళ్ళు మూసి, తెరిచేలోపు..’ అనే ప్రస్తావన కూడా తెలిసే వుంటుంది.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ‘కళ్ళు మూసుకుంటే’ అనే ప్రస్తావన తెస్తున్నది ‘త్వరగా’ అన్న కోణంలోనే.
కళ్ళు మూసుకుని తెరిచే లోపు ఏడాది గడిచిపోయిందట. సో, ఇంకో మూడేళ్ళు కళ్ళు మూసుకుంటే.. మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చేస్తుందట. అలాగని చెబుతున్నారు వైఎస్ జగన్.
కాలం విలువైనది.. కళ్ళు మూసుకుపోతే కష్టం.!
ఏ రాజకీయ నాయకుడైనా మాట్లాడాల్సిన మాటలా ఇవి.? కాలం, చాలా విలువైనది. ప్రతి క్షణమూ అత్యంత విలువైనదే. ఐదేళ్ళు ఓ రాష్ట్రానికి, అత్యంత కీలకం.
ఐదేళ్ళ పాలనలో వైసీపీ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసింది. ఆ ఐదేళ్ళలో రాజధాని అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేసి వుంటే, రాష్ట్రానికి అదే ప్రధాన ఆదాయ వనరు అయి వుండేది.
అధికారం పోతుందని తెలిసీ, ‘వై నాట్ 175’ అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎలా అనగలిగారు.. అంటే, ఇదిగో, ఇలా కలగనడం వల్లే. కళ్ళు మూసుకుపోతే, వాస్తవ ప్రపంచం కనిపించదు మరి.!
151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితమైపోయాక కూడా, వైఎస్ జగన్ ‘కళ్ళు మూసుకుపోయే’ వున్నారు తప్ప, కళ్ళు తెరిచి వాస్తవ ప్రపంచాన్ని చూడలేకపోతున్నారు.
Ys Jagan Kallu Moosukuntey.. కళ్ళు మూసుకుపోతే కష్టమే..
అందుకే, ఎక్కడికి వెళ్ళినాసరే, ‘నాలా మీరు కూడా కళ్ళు మూసుకోండి’ అని చెబుతున్నట్లున్నారాయన.! ప్రశాంతమైన నిద్రలో, మంచి మంచి కలలు వస్తాయ్.
ఆ మంచి మంచి కలల్ని, సాకారం చేసుకోవడానికి ప్రయత్నించాలి ఎవరైనా. కలలుగనండి.. వీటిని నిజం చేసుకోండి.. అని భారత క్షిపణి పితామహుడు, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్పేవారు.
అంతేగానీ, కళ్ళు మూసుకోండి.. అంటూ, కళ్ళు మూసుకుపోయిన స్టేట్మెంట్లు ఇవ్వమనలేదెవరూ.! ఒక్క వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తప్ప.
జగన్‌కి కుదిరినట్లు.. అందరికీ కుదురుతుందా.?
ముఖ్యమంత్రి కొడుకుగా వేల కోట్లకు అధిపతి అయిన జగన్.. ‘కళ్ళు మూసుకోమని’ చెప్పడంలో వింతేమీ లేదు. కానీ, సామాన్యులకి అలా కుదరదు. కళ్ళు తెరిచి, వాస్తవం చూడాలి.
కష్టపడాలి. ఎమ్మెల్యేగా గెలిచీ, అసెంబ్లీకి వెళ్ళడంలేదు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. స్కూల్లో చేరాక, స్కూలుకి వెళ్ళనంటే, చదువెలా వస్తుంది.? ఉద్యోగంలో చేరి, ఉద్యోగానికి రోజూ వెళ్ళకపోతే ఉద్యోగం వుంటుందా.?
సభ్య సమాజానికి తప్పుడు సంకేతాలు ఇవ్వడమే వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలిసిన రాజకీయం.. అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? ఇకనైనా కళ్ళు తెరవాలి జగన్.!