Janasenani Pawan Kalyan Thyaagam.. రాజకీయాల్లో ఒకటి ప్లస్ ఒకటి అంటే, రెండు అవుతుందనుకోవడం పొరపాటు. ఒక్కోసారి అది ‘మూడు’ కూడా అవ్వొచ్చు.! లేదంటే, రెండూ కలిసి సున్నా అవ్వొచ్చు.
నిజమే, రాజకీయం అంటేనే అంత.! రాజకీయాల్లో ఈక్వేషన్స్ డిఫరెంట్‌గా వుంటాయ్.! ఇది రాజకీయాల గురించి ఏమాత్రం తెలిసినవారికైనా ఇట్టే అవగతమవుతుంది.
తెలుగు దేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న జనసేన పార్టీ, 2024 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తొలుత 24 అసెంబ్లీ, మూడు పార్లమెంటు సీట్లతో సరిపెట్టుకుంది.
అందులోంచి మూడు అసెంబ్లీ, ఒక లోక్ సభ సీటుని తాజాగా భారతీయ జనతా పార్టీ కోసం త్యాగం చేసింది జనసేన పార్టీ.
Janasenani Pawan Kalyan Thyaagam.. తగ్గడమే కాదు.. పంతం నెగ్గించుకోవడమూ తెలియాలి..
ఏం చేసినా, అధికార వైసీపీని అధికారం నుంచి దించెయ్యడమే లక్ష్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బలంగా చెబుతున్నారు.
ఇదే అభిప్రాయం, పొత్తు పెట్టుకున్న ఇతర పార్టీలకీ వుండాలి కదా.! ఆ లెక్కన త్యాగాలు అట్నుంచి కూడా గట్టిగానే వుండాలి కదా.?
ఈ మొత్తం వ్యవహారంలో బాగా లాభపడుతున్నది భారతీయ జనతా పార్టీ. ఆ తర్వాతి లాభం తెలుగు దేశం పార్టీకి. దారుణంగా నష్టపోతున్నది జనసేన పార్టీ.
త్యాగానికి కూడా ఓ హద్దు వుంటుంది. తలపండిన రాజకీయం టీడీపీ సొంతం. బీజేపీ సంగతి సరే సరి.! 2024 ఎన్నికల తర్వాత తెలుగు దేశం పార్టీ తోక జాడిస్తే, బీజేపీ ప్లేటు ఫిరాయిస్తే.? జనసేన పరిస్థితి ఏంటి.?
2019 ఎన్నికల నాటి వైఫల్యం..
2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఒకే ఒక్క సీటు గెలవగలిగింది. దాన్నీ నిలబెట్టుకోలేకపోయింది. అందుకే, జనసేనాని ఆచి తూచి వ్యవహరిస్తున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూశాక, జనసేనాని ‘తగ్గడం’ అన్నది తప్పనిసరైంది.
మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్ సభ సీట్లలో జనసేన పోటీ చేయాల్సిందేనన్న భావన జనసైనికుల్లో వుండడం వింతేమీ కాదు.
Also Read: yeSBee Opinion: సేనాని పవన్ కళ్యాణ్‌కి సైనికుల వెన్నుపోటు.?
కానీ, జనసేన పార్టీకి వున్న ఆర్థిక వనరులేంటి.? అన్నదీ జనసేనాని ఆలోచించే వుంటారు కదా.? అయినాగానీ, 21 ప్లస్ 2 అన్న ఈక్వేషన్.. ఎందుకో అస్సలు ఎవరికీ రుచించడంలేదు.
100 పర్సంట్ స్ట్రైక్ రేట్ రాజకీయాల్లో కష్ట సాధ్యం.! కానీ, ఈ ఈక్వేషన్ పట్ల నమ్మకంతో వుండడం తప్ప, జనసేన పార్టీకీ, ఆ పార్టీ మద్దతుదారులకీ ఇంకో ఆప్షన్ లేదు.