Janasenani Pawan Kalyan Vyuham.. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీకి వచ్చిన ఓట్లు.. ఆ పార్టీ గెలుచుకున్న ఒకే ఒక్క సీటు.. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంత కాలిక్యులేటివ్‌గా వుంటారు.?
ఔను, జనసేన అధినేతకు అన్ని విషయాల మీదా స్పష్టత వుంది. ఇప్పుడు రాజకీయాలు ఎలా వున్నాయ్.? ఓటర్లను రాజకీయ పార్టీలు ఎలా డబ్బులతో కొనేస్తున్నాయ్.? ఇవన్నీ జనసేనానికి తెలుసు.
2024 ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలు డబ్బుల్ని పంచకుండా పోటీ చేయగలవా.? ఛాన్సే లేదు.! మరి, ఆ ‘మాయ’ నుంచి ప్రజలెలా బయటపడతారు.?
Janasenani Pawan Kalyan Vyuham.. జనసేనాని వ్యూహమిదేనా.?
ఇంతకీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యూహమేంటి.? ‘ముఖ్యమంత్రి పదవిని టీడీపీ లేదా బీజేపీ నుంచి డిమాండ్ చేయలేం..’ అని జనసేనాని తేల్చేశారు.

‘కష్టపడి సాధించుకుందాం..’ అని జనసేనాని స్పష్టతనిచ్చినా, అది మీడియాలో కనిపించదు. ఎందుకంటే, మీడియానే ప్రధాన రాజకీయ పార్టీలు మేనేజ్ చేసేస్తున్నాయ్.
జనసేన సిద్ధాంతాలు జనంలోకి వెళ్ళవ్.. జనసేన సంబంధిత విషయాలు మీడియాలో కనిపించవ్.! మరెలా.?
అత్యుత్సాహం.. కొంప ముంచేస్తుంది..
2019 ఎన్నికల్లో అత్యుత్సాహమే కొంప ముంచేసింది. నాయకులు టిక్కెట్లను ఆశించారుగానీ, కింది స్థాయిలో పని చేయలేకపోయారు.
ఈ నేపథ్యంలోనే, అత్యుత్సాహం తగ్గించుకుని.. అత్యంత వ్యూహాత్మకంగా అడుగులేయాలన్నది జనసేనాని ఆలోచన. అందుకే, ఎక్కువగా ఊహించుకోవద్దని చెబుతున్నారు.
జనసేనాని చెబుతున్న నంబర్ నలభై.. చాలా చాలా కీలకమైనది. ఆ నలభై స్థానాల్ని జనసేన గెలుచుకుంటే, రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పు వస్తుంది.
Also Read: పొలిటికల్ ఎంవోయూ.! నిజం.. నేతి బీరకాయ్.!
ఖచ్చితంగా బలం వున్న స్థానాల్లో మరింత కష్టపడితే.. ఆ నలభై సీట్లతో ముఖ్యమంత్రి పీఠమెలా ఎక్కాలో జనసేనాని దగ్గర వ్యూహం ఇప్పటికే సిద్ధమైపోయి వుందన్నమాట.
ఉన్నతమైన ఆలోచనలతో చూడగలిగితే.. జనసేనాని అంతరంగం ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. దురదృష్టం, అంతటి జ్ఞానం లేనోళ్ళదే రాజ్యమిప్పుడు.!
రాజకీయం ప్రజల కోసం.. అన్న కనీస విజ్ఞతని విస్మరించిన రాజకీయ పార్టీలు, సామాజిక బాధ్యతను విస్మరించిన మీడియా.. వెరసి, జనసేనాని వ్యూహాల్ని అర్థం చేసుకోవడం అంత తేలిక కాదు.!