Janhvi Kapoor Achiyyamma Peddi.. బుచ్చిబాబు సన దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమా నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్‌డేట్స్ షురూ అయ్యాయ్.!
ఒకే రోజు రెండు పోస్టర్లను ‘పెద్ది’ టీమ్ విడుదల చేసింది. రెండూ, హీరోయిన్ జాన్వీ కపూర్‌కి సంబంధించినవే కావడం గమనార్హం.
పొలిటికల్ లీడర్.. తరహాలో కనిపిస్తోంది జాన్వీ కపూర్.! పేరేమో ‘అచ్చియ్యమ్మ’.! నిజానికి, ఈ పేరు పెట్టడానికి దర్శకుడు బుచ్చిబాబు చాలా చాలా ఆలోచించి వుండాలి.
ఇప్పుడెవరూ ఇలాంటి పేరు పెట్టడానికి ఇష్టపడరుగానీ, ఒకప్పుడు ఇది చాలా చాలా పాపులర్ నేమ్.! దాంతో, చాలామంది ఈ పేరుకి బాగా కనెక్ట్ అవుతున్నారు.
Janhvi Kapoor Achiyyamma Peddi.. Fierce Fearless.. అచ్చియ్యమ్మ..
‘ఫియర్స్.. అండ్ ఫియర్‌లెస్..’ అంటూ, ‘అచ్చియ్యమ్మ’ పాత్రని, పోస్టర్ ద్వారా పరిచయం చేశాడు దర్శకుడు బుచ్చిబాబు సన.
తొలి సినిమా ‘ఉప్పెన’తో సంచలన విజయాన్ని అందుకున్న బుచ్చిబాబు సన నుంచి వస్తోన్న రెండో సినిమా ఇది.

ఇక, రామ్ చరణ్ – జాన్వీ కపూర్ కాంబినేషన్‌లో తొలి సినిమా ఈ ‘పెద్ది’.! రామ్ చరణ్ పేరు ‘పెద్ది’ ఈ సినిమాలో.
వాస్తవానికి రామ్ చరణ్ – జాన్వీ కపూర్ కలిసి ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రీమేక్ లేదా సీక్వెల్‌లో కలిసి నటిస్తారనే ప్రచారం తొలుత జరిగింది.
Also Read: ప్రియాంక చోప్రా జోనాస్.. రెమ్యునరేషన్ ఎంత.?
తెలుగు తెరపై జాన్వీ కపూర్ తెరంగేట్రం రామ్ చరణ్‌తోనేనంటూ అప్పట్లో చాలా చాలా గాసిప్స్ వినిపించాయి కూడా.!
తెలుగులో జాన్వీ కపూర్‌కి ఇది రెండో సినిమా. ‘దేవర’ సినిమాతో తెరంగేట్రం చేసింది జాన్వీ కపూర్ తెలుగులో.!
