Table of Contents
Janhvi Kapoor Beauty Mantra: వేగంగా సన్నబడిపోవాలనే ఆలోచనలో వుంటారు చాలామంది. కానీ, బరువు తగ్గేందుకోసం ‘నెమ్మది’ అస్త్రాన్నే ప్రయోగించాలి. లేదంటే, అనేక అనారోగ్య సమస్యలు వచ్చిపడతాయి. ఒక్కోసారి వేగంగా చేసే కసరత్తులు ప్రాణాంతకంగా కూడా మారతాయ్.!
శరీరాన్ని ఫిట్ అండ్ పెర్‌ఫెక్ట్‌గా వుంచుకోవడానికి కఠినమైన కసరత్తులు చేస్తుంటారు చాలామంది. అలాంటివారిలో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
అతి వేగం అత్యంత ప్రమాదకరం.!
ఇటీవల కొందరు సెలబ్రిటీలు అకాలమరణం చెందడానికి కఠినమైన కసరత్తులు కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.
నిదానమే ప్రధానం.. అని పెద్దలు ఊరికే చెప్పలేదు. కసరత్తుల విషయంలోనూ నిదానం తప్పనిసరి. ఆ మాటకొస్తే, వేగంగా పరిగెత్తేవారికంటే, నెమ్మదిగా జాగింగ్ చేసేవారికే దానివల్ల ప్రయోజనాలు ఎక్కువని పలు అధ్యయనాల్లో తేలింది.
Janhvi Kapoor Beauty Mantra.. స్లో అండ్ స్టడీ విన్స్ ది గ్లామర్ రేస్.!
‘యోగా’ విషయానికొస్తే, అందులో ‘నెమ్మది’కి చాలా ప్రాముఖ్యత వుంది. ఏ ఆసనం వేసినా, నెమ్మదిగా ప్రారంభించి.. నెమ్మదిగానే ముగించాల్సి వుంటుంది ‘యోగా’ చేసేవారెవరైనా.
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కూడా ‘నెమ్మది’ ప్రాముఖ్యతను తెలుసుకుంది. వేగంగా చేసే కసరత్తుల కంటే, నెమ్మదిగా, శ్రద్ధగా, ఏకాగ్రతతో చేసే కసరత్తుల వల్ల మంచి ప్రయోజనాలున్నాయంటోంది. ఈ మేరకు కొన్ని ఫొటోల్నీ, వీడియోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది జాన్వీ కపూర్.
మీ శరీరాన్ని కూడా గౌరవించాల్సిందే.!
తగినంత సమయం వ్యాయామం కోసం కేటాయించడం, పూర్తి ఏకాగ్రతతో కసరత్తులు లేదా యోగా వంటివి చేయడం ఉత్తమం. తద్వారా మనసు తేలికపడుతుంది.. శరీరానికీ తేలికగానే పని చెప్పినట్లవుతుంది.
Also Read: ఏ‘కాంత’ సేవకు పిలిచిన ఆ హీరో ఎవరబ్బా.?
అన్నట్టు, మహిళలు శరీరంలో ‘గ్లో’ కోల్పోకుండా శరీర బరువుని తగ్గించుకోవాలంటే.. ఈ ‘Go Slow’ వ్యాయామం చేయడం ఉత్తమమని ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారండోయ్.!
కఠినమైన కసరత్తులు చేస్తే, శరీరంలో ‘గ్లో’ తగ్గిపోతుంది.. ‘చబ్బీ’ లుక్ (Janhvi Kapoor Beauty Mantra) కూడా దెబ్బతింటుందిట.