Janhvi Kapoor NTR30 తన కుమార్తె వెండితెరపై వెలిగిపోతోంటే.. చూసి మురిసిపోవాలనుకుంది.! అతిలోక సుందరి శ్రీదేవి,
తన కుమార్తె జాన్వీ కపూర్‌ని నటిగా తీర్చిదిద్దేందుకు చాలా చాలా కష్టపడిందిగానీ.. తన కుమార్తె సక్సెస్‌ఫుల్ సినీ జర్నీని మాత్రం చూడలేకపోయింది.
ఔను, శ్రీదేవి అకాల మరణం.. జాన్వీ కపూర్ జీవితంలో అతి పెద్ద లోటు.! తన వెన్నంటే వుండి, తనను సినీ రంగంలో ముందుకు నడిపించాలని జాన్వీ కపూర్, తన తల్లి శ్రీదేవి గురించి చాలా చాలా అనుకుంది.
తెలుగు సినిమాలంటే జాన్వీ కపూర్‌కి చిన్న చూపు..
అసలు తప్పంతా జాన్వీ తండ్రి బోనీ కపూర్‌దే..
శ్రీదేవి బతికి వుంటే.. తెలుగులోనే తొలుత తన కుమార్తె జాన్వీతో తెరంగేట్రం చేయించేది..
ఇలా ఎన్నెన్నో ప్రచారాలు.. ఎలాగైతేనేం, జాన్వీ కపూర్ తెలుగు సినిమాల్లో నటించడం ఖాయమైపోయింది.. అదీ జూనియర్ ఎన్టీయార్ సరసన.!
Mudra369
‘ఖచ్చితంగా నా కూతురు తెలుగు సినిమాల్లో నటిస్తుంది. ఏమో, తెలుగు సినిమాతోనే తెరంగేట్రం చేస్తుందేమో..’ అని ఓ ఇంటర్వ్యూలో శ్రీదేవి చెప్పింది కూడా.!
ఆలస్యం.. అనివార్యం.?
కానీ, అనుకోని కారణాల వల్ల జాన్వీ కపూర్ తెలుగు తెరపై తెరంగేట్రం చేయడానికి చాలా సమయం తీసుకుంది. ఎలాగైతేనేం, జాన్వీ కపూర్ నటిస్తోన్న తొలి తెలుగు సినిమా సెట్స్ మీదకు వెళుతోంది.

అలనాటి అందాల తారక రాముడు.. స్వర్గీయ నందమూరి తారక రామారావు సరసన ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది శ్రీదేవి.
ఆ తారక రాముడి మనవడు జూనియర్ ఎన్టీయార్ సరసన అలనాటి అతిలోక సుందరి కుమార్తె జాన్వీ కపూర్ నటిస్తోందిప్పుడు.
Janhvi Kapoor NTR30.. లుక్కు అదిరింది..
తాజాగా ‘ఎన్టీయార్ 30’ సినిమా నుంచి జాన్వీ కపూర్ లుక్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ప్రత్యేకంగా ఫొటోసెషన్ చేయించి.. ఆ ఫొటోని వదిలారు. సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కావాల్సి వుంది.
Also Read: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ రెమ్యునరేషన్.! మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.!
కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. హీరో తుపాను అయితే.. సినిమాలో జాన్వీ కపూర్ పాత్ర.. ప్రశాంతతకు నిదర్శనమట.