Jani Master Ys Jagan.. అక్రమాస్తుల కేసులో 16 నెలలు జైలులో వున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి.
తన వద్ద పని చేసిన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌ని లైంగికంగా వేధించారన్న కేసులో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కూడా జైలుకెళ్లారు.
వై.ఎస్. జగన్ బెయిల్ మీదున్నారు. జానీ మాస్టర్ కూడా బెయిల్ మీదనే వున్నారు. వై.ఎస్.జగన్ పులివెందుల ఎమ్మెల్యేగా పని చేస్తున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేతగానూ వున్నారు. బెయిల్ మీద విడుదలయ్యాకా, జానీ మాస్టర్ తన కొరియోగ్రఫీ కొనసాగిస్తున్నారు.

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో జానీ మాస్టర్ ఓ పాటని కంపోజ్ చేశారు. శ్రీలంకలో ఈ పాటని చిత్రికరించారు.
రామ్ చరణ్, బుచ్చిబాబుతో కలిసి వున్న ఫోటోని జానీ మాస్టర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతే.! వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్ జానీ మాస్టర్ మీద విషం చిమ్మడం మొదలుపెట్టేశారు.
Jani Master Ys Jagan.. వైసీపీ అమాయకపు ప్రశ్న..
లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్‌కి అవకాశం ఇవ్వడమేంటీ.? అంటూ రామ్ చరణ్‌ని ప్రశ్నించేస్తున్నారు వైసీపీ మద్దతుదారులు.
జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేయడం అనైతికం అయితే, వైఎస్ జగన్ రాజకీయాల్లో కొనసాగడం కూడా అనైతికమే. వైసీపీలో పలువురు నేతలపై లైంగిక వేధింపుల ఆరోపణలున్నాయ్.
Also Read: ట్రంప్ లక్ష డాలర్ల దెబ్బ.! ఎన్ని H1B Visa వికెట్లు పడిపోతాయో.!
వాళ్లు రాజకీయాల్లో కొనసాగుతున్నారు. జానీ మాస్టర్ తప్పు చేశారా.? లేదా.? అనేది తేల్చాల్సింది న్యాయ స్థానం. అప్పటి వరకూ ఆయన కేవలం నిందితుడు మాత్రమే.
వై.ఎస్.జగన్‌తో పోల్చితే జానీ మాస్టర్ తక్కువ కాలం మాత్రమే జైలులో వున్నారు. ఇలాంటి విషయాల్లో వైసీపీ సోషల్ మీడియా మద్దతుదారుల అత్యుత్సాహం.. వైసీపీ రాజకీయ మనుగడనే ప్రశ్నార్ధకం చేస్తోంది.
జానీ మాస్టర్ మీద దుష్ప్రచారం చేస్తే, అది వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి మెడకే చుట్టుకుంటుందని వైసీపీ కార్యకర్తలు తెలుసుకోకపోతే ఎలా.!
