రాధిక ఆప్టే: లావెక్కాను, మళ్లీ తగ్గాను.! అమ్మగా చెబుతున్నాను.!
Radhika Apte
Radhika Apte Mom Says.. అందాల భామ రాధికా ా ఆఫ్టే అంటే అందరికీ కాంట్రవర్సీలే గుర్తొస్తుంటాయ్.. అప్పుడెప్పుడో రామ్ గోపాల్ వర్మ ‘రక్త చరిత్ర’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైంది.
ఆ తర్వాత తెలుగులో చేసినవి రెండే రెండు సినిమాలు. ఒకే ఒక్క హీరో. ఆయనే నందమూరి నట సింహం బాలకృష్ణ.
రెండు సినిమాలకే ఈ అమ్మడు టాలీవుడ్‌ని బజారుకీడ్చేసింది. టాలీవుడ్‌పై అనవసరమైన ఆరోపణలు చేసి రచ్చకెక్కింది.
Radhika Apte Mom Says.. టాలీవుడ్‌పై గుర్రు గుర్రు..
అవకాశమొస్తే చాలు టాలీవుడ్‌ని ఆడిపోసుకోవడమే పనిగా పెట్టుకునేది రాధికా ా ఆప్టే. అలా టాలీవుడ్‌లో రెండు సినిమాలకే పరిమితమైంది కానీ,
బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించింది. అక్కడ స్టార్ హీరోయిన్ కూడా. అలాగే హాలీవుడ్ వరకూ కూడా తన స్టార్‌డమ్‌ని విస్తరించింది రాధికా ఆప్టే.
ఆ సంగతి అటుంచితే, రీసెంట్‌గా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాధికా ఆప్టే తన పర్సనల్ విషయాలు కొన్ని షేర్ చేసుకుంది.
2012లో బెనిడెక్ట్ జేలర్ అనే బ్రిటీష్ వ్యక్తిని రాధికా ఆప్టే వివాహమాడిన సంగతి తెలిసిందే. వివాహానంతరం కూడా సినిమాల్లో కొనసాగుతూనే వుందనుకోండి.
తాజా ఇంటర్వ్యూలో భాగంగా తాను ప్రెగ్నెంట్ అయిననాటి సంగతులు గుర్తు చేసుకుని రాధికా ఆప్టే మురిసిపోయింది.
రాధికా ఈ మాటలు నీవేనా.!
ఎప్పుడూ బక్క పలచని ఫిజిక్‌తో వుండే రాధికా ఆప్టే ప్రెగ్నెన్సీ సమయంలో సహజంగానే కాస్త లావుగా మారింది.
అంత లావుగా తననెప్పుడూ చూసుకోలేదనీ ఆ టైమ్‌లో తాను చాలా ఇబ్బంది పడ్డాననీ చెప్పుకొచ్చింది.

సరిగా నిద్ర వుండేది కాదనీ, ఆకలి వేసేది కాదనీ చెప్పింది. ఆ టైమ్‌లో తనకు తన భర్త బెనెడిక్ట్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ బాగా వుందని చెప్పుకొచ్చింది.
కానీ, డెలివరీ తర్వాత తాను పొందిన ఆనందం ముందు ఆ టైమ్‌లో పడిన ఇబ్బందులన్నీ పటాపంచలైపోయాయనీ రాధికా ఆప్టే చెప్పింది.
Also Read: ఇస్మార్ట్ రామ్ ఎనర్జీని ‘బచ్చన్’ బ్యూటీ మ్యాచ్ చేయగలదా.?
ప్రతీ మహిళ జీవితంలోనూ ప్రెగ్నెన్సీ అనేది ఓ స్వీట్ మెమరీ అనీ, ఖచ్చితంగా ఆ ఫీల్‌నీ ఆస్వాదిస్తేనే ఆ అనుభవం తెలుస్తుందనీ చెప్పుకొచ్చింది రాధికా ఆప్టే.
ఎప్పుడూ కాంట్రవర్సీ ఇష్యూస్‌తోనే మీడియా ముందుకొచ్చే రాధికా ఆప్టే నుంచి ఇలాంటి ఓ సాధారణమైన మాటలు ఇంత ఎఫెక్టివ్‌గా వినడం నిజంగా ఒకింత ఆశ్చర్యకరమే అనిపిస్తుంది.
ఎంతైనా అమ్మతనంలోని కమ్మదనం అలాంటిది.!