Jawan Movie Maheshbabu Review.. బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ నటించిన ‘జవాన్’ సినిమాకి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు, బ్లాక్‌బస్టర్ రివ్యూ ఇచ్చేశాడు.!
ఇంకా బాలీవుడ్ ఏంటి.? టాలీవుడ్ ఏంటి.? అంతా ఇప్పుడు ఇండియన్ సినిమానే.! ‘జవాన్’ రిలీజ్ కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నానంటూ, సినిమా విడుదలకు ముందు మహేష్ ట్వీటేసిన సంగతి తెలిసిందే.
‘మనిద్దరం కలిసి చూద్దాం..’ అంటూ షారుక్, మహేష్‌కి (Super Star Maheshbabu) రిప్లయ్ కూడా ఇచ్చాడు. ‘ఖచ్చితంగా..’ అంటూ మహేష్, షారుక్ ఖాన్‌కి సమాధానమిచ్చాడు.
Jawan Movie Maheshbabu Review.. బ్లాక్ బస్టర్ రివ్యూ..
‘జవాన్’ సినిమా విడుదలైంది.. మంచి టాక్ తెచ్చుకుంది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జవాన్’ సినిమాలో నయనతార, దీపిక పడుకొనే హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే.
కాగా, ‘జవాన్’ సినిమాకి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు (Super Star Maheshbabu) నుంచి రివ్యూ కూడా వచ్చేసింది.
‘బ్లాక్‌బస్టర్ సినిమా’ అంటూ ఒక్క మాటలో తేల్చేసిన మహేష్, దర్శకుడు అట్లీ, కింగ్ సైజ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడంటూ పేర్కొన్నాడు.
షారుఖ్ ఖాన్ ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ అన్ మ్యాచబుల్.. అంటూ కితాబులిచ్చేశాడు మహేష్‌బాబు. ‘జవాన్’, షారుఖ్ ఖాన్ గత రికార్డుల్ని తిరగరాస్తుందని మహేష్ చెప్పుకొచ్చాడు. మహేష్ రివ్యూకి షారుఖ్ అభిమానులు ఫిదా అయిపోతున్నారు.
లవ్ యూ మై ఫ్రెండ్..
కాగా, ‘జవాన్’కి బ్లాక్ బస్టర్ రివ్యూ ఇచ్చిన మహేష్‌కి షారుక్ ఖాన్ థ్యాంక్స్ చెప్పాడు. లవ్ యూ మై ఫ్రెండ్.. అని పేర్కొంటూనే, మరింత కష్టపడతానని షారుక్ ట్వీటేయడం గమనార్హం.
Also Read: హరి హరా.! అడ్డంగా నరికేస్తున్నారా.?
సాధారణంగా కొన్ని తెలుగు సినిమాలకి మహేష్ (Super Star Maheshbabu) ట్విట్టర్ హ్యాండిల్ నుంచి షార్ట్ రివ్యూలు వస్తుంటాయ్.
ఈసారి షారుక్ ఖాన్ సినిమాకి మహేష్ తనదైన రివ్యూ ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. రివ్యూ సరే, రేటింగ్ ఎంత.? అని అభిమానులు, మహేష్‌ని ట్విట్టర్ వేదికగా ప్రశ్నిస్తుండడం గమనార్హం.