Jenda Koolie Roja Selvamani.. రాజకీయ విమర్శలు చేసే క్రమంలో నోటికి హద్దూ అదుపూ లేకపోవడం.. అంటే, అలాంటి వ్యవహారానికి బ్రాండ్ అంబాసిడర్‌గా వైసీపీ నేత రోజా పేరుని ముందు వరుసలో పెట్టొచ్చు.
డిక్కీ బలిసిన కోడి, ఇత్తడైపోద్ది.. ఇలా చెప్పుకుంటూ పోతే, పోలీస్ అధికారులపై లం.. కొడుకులు’ అనే పరమ నీఛమైన పదజాలం కూడా రోజా నోటి వెంట వచ్చింది గతంలో.
‘నన్ను రేప్ చేసే ధైర్యం మీకుందా.? ఒకట్రెండు రేప్‌లకే రాద్ధాంతమా.?’ అంటూ రోజా చెలరేగిపోయిన వ్యవహారాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే వుంటాయ్.
ఇష్టమొచ్చినట్లు రాజకీయ విమర్శలు, వ్యక్తిగత దూషణలకు దిగడం.. అట్నుంచి అదే స్థాయిలో కౌంటర్ ఎటాక్ వస్తే, విక్టిమ్ కార్డ్ తెరపైకి తీసుకురావడం రోజాకి వెన్నతో పెట్టిన విద్య.
Jenda Koolie Roja Selvamani.. పొలిటకల్ కప్ప గెంతులు..
టీడీపీ నుంచి రాజకీయ జీవితం ప్రారంభమైంది సినీ నటి రోజాకి.! టీడీపీలో తెలుగు మహిళ అధ్యక్షురాలిగా కూడా రోజా పని చేసిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత, అప్పటి కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పంచన చేశారు. కాంగ్రెస్‌లో చేరేందుకు ఆమె రంగం సిద్ధం చేసుకున్నారు. ఇంతలోనే వైఎస్సార్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు.
వైఎస్ జగన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టాక అందులో చేరిన రోజా, నగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.. ఓ సారి మంత్రిగా కూడా పని చేశారామె.
అంటే, టీడీపీ నుంచి వైసీపీ.. వయా కాంగ్రెస్ అన్నమాట.. రోజా పొలిటికల్ జర్నీ.! దానర్థం మూడు పార్టీల కండువాల్ని ఒకదాని తర్వాత ఒకటి ఆమె కప్పుకున్నట్లే కదా.!
మూడు పార్టీల జెండాల్ని మోసిన రోజా, జన సేన పార్టీ కార్యకర్తల్ని ఉద్దేశించి ‘జెండా కూలీలు’ అంటూ తాజాగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి.
నిజానికి, వివాదాస్పదం కంటే.. హాస్యాస్పదమవుతున్నాయి రోజా వ్యాఖ్యలు.! అసలు సిసలు జెండా కూలీ ఎవరో కాదు, రోజానే.. అంటూ, ‘డైమండ్ రాణి’ అనే ట్యాగ్‌ని కూడా రోజాకి తగిలిస్తున్నారు జనసేన కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా.
రోజా ఏ వివాదాస్పద వ్యాఖ్య చేసినా, దాని వెనుక పబ్లిసిటీ స్టంట్ వుంటుంది. ఆమె తిట్టడం వెనుక, తిట్టించుకోవడం.. అనే కాన్సెప్ట్ అంతర్లీనంగా దాగి వుంటుంది.
రేపో మాపో, విక్టిమ్ కార్డ్ తెరపైకి తెచ్చి, మీడియా ముందు రోజా కంట తడి పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.!
అన్నట్టు, పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటు కూడా తాకలేడు.. అంటూ, నోటికొచ్చినట్లు మాట్లాడిన రోజా, 2024 ఎన్నికల్లో ఓడిపోయి, అసెంబ్లీ గేటు తాకడానికి కూడా అర్హత కోల్పోయిన సంగతి తెలిసిందే.
