సుదీర్ఘ రాజకీయ అనుభవం ఆయన సొంతం. దాదాపు ఐదు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఆయన అత్యున్నత పదవిని ఎట్టకేలకు పొందారు. ఆయనే జో బైడెన్ (Joe Biden Wins). అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ పరాజయాన్ని చవిచూసింది.
‘తుంటరి’ ట్రంప్ (Donald Trump) రెండోసారి ప్రధాని అవ్వాలనుకున్నా, అమెరికన్లు ‘నై’ అనేశారు. రిపబ్లికన్లకు పట్టం కట్టేశారు అమెరికా ఓటర్లు. జో బైడెన్.. అమెరికా అధ్యక్షుడిగా విజయం సాధించారు. నిజానికి, జో బైడెన్ విజయం సాధించినా.. తూతూ మంత్రం విజయాన్నే అందుకుంటారని అంతా అంచనా వేశారు.
కానీ, భారీ విజయాన్నే జో బైడెన్ సొంతం చేసుకోవడం గమనార్హం. కాగా, తన ఓటమిని హుందాగా అందీకరించేందుకు ట్రంప్ సుముఖత వ్యక్తం చేయడంలేదు. ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయంటూ అమెరికన్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ట్రంప్, తానే అసలు సిసలు విజేతనని తెగేసి చెబుతున్నారు.
బొటాబొటి మెజార్టీతో జో బైడెన్ గెలిచి వుంటే, (Joe Biden Wins, Donald Trump Lost) ట్రంప్ వాదనలో కాస్తో కూస్తో పస వుండేదేమో. కానీ, ఇక్కడ జో బైడెన్ బంపర్ మెజార్టీతో హిట్టుకొట్టేశారు. దాంతో, ట్రంప్ శిబిరం పూర్తిగా డీలా పడిపోయింది. అమెరికా అంటే ప్రపంచానికే పెద్దన్న.
అలాంటప్పుడు, ఎంత బాధ్యతగా వుండాలి.? బాధ్యతారాహిత్యం.. అన్న మాటకే నిలువెత్తు నిదర్శనం డోనాల్డ్ ట్రంప్. తాను అధ్యక్షుడిగా వుండగా, అన్ని దేశాల్నీ కెలికేశాడు ట్రంప్. ఏమో, బైడెన్ పాలన ఎలా వుంటుందో.? మామూలుగా అయితే వ్యవహారం పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టే వుంటుంది.
ట్రంప్ అయినా, బైడెన్ అయినా.. ఎవరైనాసరే ‘అమెరికా ఫస్ట్’ అనాల్సిందే. మన భారతీయులకు సంబంధించినంతవరకు చూసుకుంటే వీసా వ్యవహారాలు, చైనా – పాక్ విషయంలో అమెరికా వైఖరి, వాణిజ్య అంశాలు.. వంటివాటిపై జో బైడెన్ ఎలా వ్యవహరిస్తారు.? అన్నదాని చుట్టూనే చర్చ జరుగుతోంది.
ట్రంప్ హయాంలో భారత్ – అమెరికా మధ్య సన్నిహిత సంబంధాలు కాస్తో కూస్తో బలపడిన మాట వాస్తవం. మరి, బైడెన్ (Joe Biden Wins) ఆ స్నేహ సంబంధాల్ని మరింత ముందుకు తీసుకెళతారా.? వేచి చూడాల్సిందే.