Jr NTR Chandrababu సినిమాలు వేరు.. రాజకీయాలు వేరు కావొచ్చు. కానీ, సినిమాల్లో రాజకీయాలుంటాయ్.. రాజకీయాల్లోనూ సినిమాలుంటాయ్.!
రాజకీయాల్ని సినిమాలు శాసించిన రోజులూ వున్నాయ్. సినిమాల్ని శాసిస్తున్న రాజకీయాల్నీ చూస్తున్నాం.
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకి గోల్డెన్ గ్లోబ్ పురస్కారం దక్కడంపై స్పందించారు.
చంద్రబాబు స్పందనకి థ్యాంక్స్ చెప్పాడు యంగ్ టైగర్ ఎన్టీయార్. ‘థాంక్యూ సో మచ్ మావయ్యా’ అనడమే ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.. ఇటు సినీ వర్గాల్లో, అటు రాజకీయాల్లో.
Jr NTR Chandrababu.. థాంక్యూ వెనుక ఇంత కథ వుందా.?
చంద్రబాబు బావమరిది హరికృష్ణ.. ఆ హరికృష్ణ తనయుడు యంగ్ టైగర్ ఎన్టీయార్. ఆ లెక్కన, ఎన్టీయార్‌కి చంద్రబాబు ‘మావయ్య’ అవుతారు కదా.?

మేనత్త భర్త గనుక, ‘మావయ్య’ అని సంబోదిస్తూ, ‘థాంక్యూ సో మచ్ మావయ్యా..’ అని పేర్కొంటే, అందులో రాజకయమేముంది.?
చంద్రబాబు తన ట్వీటులో ఎన్టీయార్ పేరుని ప్రస్తావించలేదట. అయినాగానీ, ఎన్టీయార్ థ్యాంక్స్ చెప్పాడట.. ఇది ఇంకో విమర్శ.!
రాజకీయ మద్దతు..
తెలుగుదేశం పార్టీ వెంటే జూనియర్ ఎన్టీయార్ వున్నాడనడానికి ఇదే నిదర్శనమని కొందరు అంటున్నారు. అదేం కాదన్నది ఇంకొందరి గుస్సా. ఎవరి గోల వారిదే.
Also Read: ఉదయ్ కిరణ్ మరణం.! తేజ మార్కు ప్రచారాస్త్రం.!
ఇక్కడికైతే, ఇది సినిమా వ్యవహారమే. పైగా, కుటుంబ వ్యవహారం కూడా.! రాజకీయ వ్యవహారం అవుతుందా.? లేదా.? అన్నది ముందు ముందు తేలుతుంది. ప్రస్తుతానికైతే సినీ, రాజకీయ రచ్చ కొనసాగుతోంది.