Jr NTR Devara ఏదన్నా సినిమా వస్తోందంటే చాలు.. లీకుల గోల మొదలవుతోంది. యంగ్ టైగర్ ఎన్టీయార్ విషయంలో ఈ లీకులు ఇప్పుడు కొత్త తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయ్.!
ఈ నెల 20న యంగ్ టైగర్ ఎన్టీయార్ (Young Tiger NTR) పుట్టినరోజు. ఈ నేపథ్యంలో కొరటాల శివ – ఎన్టీయార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా నుంచి అప్డేట్ రావాల్సి వుంది.
టైటిల్‌తోపాటు ఫస్ట్ లుక్ విడుదల చేస్తారన్న ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, చిత్ర యూనిట్ ప్రకటించకముందే ఓ టైటిల్‌ని సోషల్ మీడియాలో రుద్దేస్తున్నారు.
Jr NTR Devara పవన్ కళ్యాణ్ నుంచి.. ఎన్టీయార్‌కి.!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం ‘దేవర’ అనే టైటిల్ అనుకున్నాడు నిర్మాత, నటుడు బండ్ల గణేష్. ‘నా దేవర పవన్ కళ్యాణ్..’ అని పదే పదే చెబుతుంటాడాయన.
ఇప్పుడు అదే ‘దేవర’ టైటిల్ జూనియర్ ఎన్టీయార్ (Man Of Masses NTR) సినిమాకి పెట్టారన్నది తాజాగా జరుగుతున్న ప్రచారం తాలూకు సారాంశం.
చిత్ర యూనిట్ నుంచి అందుతున్న లీకుల నేపథ్యంలో ఇదే టైటిల్ ఖరారు.. అనుకోవచ్చు.
ఎలా లీక్ చేస్తున్నారబ్బా.?
చాలా సినిమాల విషయంలో ఈ కక్కుర్తి కనిపిస్తోంది. కొందరు సినీ జర్నలిస్టులతో నిర్మాణ సంస్థలు ‘కుమ్మక్కై’ లీకులు చేస్తున్నాయన్న ఆరోపణలూ లేకపోలేదు.
అలా ఎలా.? ఏ నిర్మాణ సంస్థ అయినా, ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుందా.? ఏమో.. ఎన్టీయార్ సినిమా విషయంలో ఏం జరిగిందోగానీ, అభిమానులైతే గుస్సా అవుతున్నారు.
ఇంతకీ, ఇదే టైటిల్ ఖాయం చేసుకోవచ్చా.? ప్రస్తుతానికైతే అంతే.! అన్నట్టు, పవన్ కళ్యాణ్ అలాగే మహేష్‌బాబు సినిమాలకీ ఇదే తలనొప్పి ఎదురవుతోంది.
Also Read: Agent Disaster.. డైరెక్టర్‌ని అవమానించి తప్పు చేశావ్ అఖిల్.!
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) – సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాకి ‘బ్రో’ అనే టైటిల్ ప్రచారంలో వుంది.
ఇక, మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాకి ‘అమరావతికి అటు ఇటు’ అనీ, ‘ఊరికి మొనగాడు’ అనీ.. ఏవేవో టైటిళ్ళు ప్రచారంలోకి వచ్చాయి. అనుకుంటున్నారు.. ప్రచారంలో వుంది.. అట.. ఇలాగైతే ఓకే.!
కానీ, టైటిళ్ళను లీక్ చేయడమేంటో.!