Sushmita Sen Is Back.. డౌటేముంది.? ఇది ముమ్మాటికీ రాక్షసత్వమే.! వయసు మీద పడుతున్నా వన్నె తగ్గని అందం ఆమె సొంతం.
అందానికి అందం.. ధైర్యానికి ధైర్యం.! ఒక్క మాటలో చెప్పాలంటే ఆమెని ‘ఐరన్ లేడీ’ అనేయొచ్చు. బాలీవుడ్ బ్యూటీ సుస్మితా సేన్ గురించి ఇలా ఎంత చెప్పుకున్నా తక్కువే.
ఇటీవలే సుస్మితా సేన్ తీవ్ర గుండె పోటుకు గురయ్యింది. ఆమెకు స్టెంట్స్ కూడా వేశారు. కొన్ని రోజుల విశ్రాంతి తర్వాత.. బ్యాక్ టు వర్క్.. అంటూ సిద్ధమైపోతోంది సుస్మితా సేన్.!
ఫైటర్ సుస్మిత..
నిజానికి సుస్మితా సేన్ ఐరన్ లేడీ.! చాలా చాలా స్ట్రాంగ్ విమెన్. ఫిట్నెస్ పరంగా చూసుకుంటే, ఎప్పుడూ కసరత్తుల్లో మునిగి తేలుతూనే వుంటుంది.
కానీ, ఏమయ్యిందో గుండె పోటు వచ్చిందామెకి. వస్తే వచ్చింది.. ప్రస్తుతం కోలుకుంది. కోలుకోగానే, కఠినతరమైన కసరత్తులకీ సిద్ధమైపోయింది. చూస్తున్నారుగా.. ఎలా శరీరాన్ని వంచేసిందో.!
ఆగండాగండీ.. అదంతా డాక్టర్ల సూచన మేరకే చేస్తోందిట సుస్మితా సేన్. వైద్యుల పర్యవేక్షణలోనే వర్కవుట్స్ ప్రారంభించానని సుస్మిత చెప్పుకొచ్చింది.
అయినా, వైద్యులు మాత్రం సుస్మితకు ఇలాంటి కసరత్తులు చేసేందుకు ఎలా అనుమతిచ్చారబ్బా.?
‘ఆర్య’ కోసమేనా.?
‘ఆర్య’ అనే వెబ్ సిరీస్‌లో సుస్మిత నటించింది. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తయ్యాయ్. మూడో సీజన్ సంబంధిత ఎపిసోడ్ల చిత్రీకరణ జరుగుతుండగా, సుస్మితా సేన్ ఇలా గుండె పోటుకి గురయ్యింది.
Also Read: Shriya Saran.. గ్లామరస్ ‘కబ్జా’.!
వేగంగా కోలుకున్నాననీ, తిరిగి ‘ఆర్య’ సెట్స్‌లో అడుగు పెట్టడానికి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నానని అంటోంది సుస్మితా సేన్.