Jr NTR Global Star.. యంగ్ టైగర్ ఎన్టీయార్ ‘విన్నపం’ పేరుతో అభిమానుల గుండెల్లో గునపాలు దించేశాడు.! అది కూడా తన అన్న నందమూరి కళ్యాణ్ రామ్ సినిమా ‘అమిగోస్’ ప్రీ రిలీజ్ వేడుకలో.
ఔను, సినిమా అప్డేట్స్ విషయంలో హీరోలపైనా, నిర్మాతలు, దర్శకులపైనా అభిమానులు తెస్తున్న ఒత్తిడిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు ఎన్టీయార్.!
యంగ్ టైగర్ ఎన్టీయార్.. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీయార్.. గ్లోబల్ స్టార్ ఎన్టీయార్.. ఇవన్నీ ఎన్టీయార్‌కి ఎవరిచ్చారు.? ఇంకెవరు అభిమానులే.!
తెలుసుకోవాలనుకోవడం నేరమా.?
‘నా భార్య కంటే ముందు మీకే చెప్తా..’ అని సినిమా అప్డేట్స్ విషయమై ఎన్టీయార్ (Young Tiger NTR), తన అభిమానుల్ని ఉద్దేశించి చెప్పాడు.
అప్డేట్స్ విషయంలో హీరోలందరూ ఎదుర్కొనే సమస్యనీ, దర్శక నిర్మాతల పాట్లనీ జూనియర్ ఎన్టీయార్ (Jr NTR) వివరించే ప్రయత్నం చేశాడు.
అభిమానులకి క్లాస్ తీసుకున్నాడు సరే.. యాంకర్ సుమ మీద గుస్సా అయ్యాడెందుకు.? వాళ్ళు అడక్కపోయినా, మీరు చెప్పించేసేలా వున్నారంటూ సుమ మీద ఎన్టీయార్ వేసిన సైటర్ వైరల్ అయ్యింది.. వివాదాస్పదమైంది కూడా.!
Mudra369
కానీ, ఇది సోషల్ మీడియా యుగం. యువత ఆ సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోయింది. సోషల్ మీడియాలో ట్రెండింగ్ తమ సినిమాలకు కలిసి రావాలని హీరోలు, దర్శక నిర్మాతలు పడే పాట్లు తక్కువేమీ కాదు.

అభిమానులే కదా.. ఇలాంటి విషయాల్లో సహకరించేది.? మరి, ఆ అభిమానులకు కావాల్సిన అప్డేట్స్ ఇవ్వకపోతే ఎలా.? అన్నదీ ఆలోచించాల్సిన విషయమే.
Jr NTR Global Star.. సున్నితమైన అంశం.. కానీ, తప్పదు.!
ఇటు అభిమానుల ఆవేదనా అర్థం చేసుకోదగ్గదే.. అటు హీరోలు, దర్శక నిర్మాతలు పడే పాట్లూ అర్థం చేసుకోదగ్గవే. విడవమంటే పాముకి కోపం.. కరవమంటే కప్పకు కోపం.. అన్నట్లుంటుంది పరిస్థితి.
Also Read: నాగచైతన్యకీ దివ్యాన్షకీ మధ్య! సమ్‌థింగ్.. భంచిక్.!
అడకత్తెరలో పోకచెక్క పరిస్థితి.. అని కూడా అనొచ్చు. ‘విన్నపం..’ అంటూనే ఎన్టీయార్ దింపిన గునపాన్ని అభిమానులు దిగమించుకోలేకపోతున్నారు.
కానీ, తప్పదు ‘జై ఎన్టీయార్’ అనాల్సిందే. అభిమానుల బలహీనత అది.! ఆ అభిమానుల బలహీనతే కదా సినిమాలకు అసలు సిసలు పెట్టుబడి.?