సినిమాని థియేటర్లలో చూస్తేనే కిక్కు.. అనే భావన ఇకపై అటకెక్కిపోతుందేమో. ఎందుకంటే, కరోనా రెండు సార్లు సినిమా పరిశ్రమను దెబ్బేయడంతో, సినిమా ప్రేమికులు వెండితెరకు శుభం కార్డు వేసేసి, హోం థియేటర్లు.. అవేనండీ, ఇంట్లోనే పెద్ద స్క్రీన్ కలిగిన టీవీల్లో ఓటీటీ ద్వారా (Vakeel Saab Amazon Prime Super Duper Hit) సినిమాల్ని చూసెయ్యడానికి మొగ్గు చూపుతున్నారు.
తాజాగా ‘వకీల్ సాబ్’ సినిమా అమెజాన్ ప్రైమ్ ద్వారా ఇంట్లోకే వచ్చేసింది. థియేటర్లలో సినిమా విడుదలై మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే. అంతకు మించిన హిట్ టాక్ ఓటీటీలో రిలీజయ్యాక ‘వకీల్ సాబ్’ సొంతం చేసుకుంది. చిత్రమేంటంటే, థియేటర్లలో సినిమా రిలీజ్ అవుతోందనగా, ముందురోజు క్రియేట్ అయిన హంగామాకి ఏమాత్రం తగ్గకుండా ఓటీటీ రిలీజ్ మీద అభిమానులే కాదు, సాధారణ ప్రేక్షకులూ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.
సోషల్ మీడియా అంతా ‘వకీల్ సాబ్’ (Vakeel Saab Amazon Prime Super Duper Hit) మేనియా ఆవహించేసింది. రాత్రి 12 గంటల నుంచి ‘నాన్ స్టాప్’గా కొన్ని ఇళ్ళల్లో ‘వకీల్ సాబ్’ మోత మోగేసిందనడం అతిశయోక్తి కాదేమో.
ఇక, ఇటీవల విడుదలైన ‘శ్రీకారం’ (Sreekaram), ‘వైల్డ్ డాగ్’ (Wild Dog), ‘చావు కబురు చల్లగా’ (Chavu Kaburu Challaga) థియేటర్లలో కంటే, ఓటీటీ వేదికల మీదనే మంచి విజయాల్ని అందుకున్నాయి. డబ్బింగ్ సినిమా ‘సుల్తాన్’ పరిస్థితీ అంతే. ఈ వ్యవహారం చూస్తోంటే, ఇకపై థియేటర్లను సినీ పరిశ్రమ నమ్ముకోవడం దండగ.. అనిపించడం ఖాయం.
అయినాగానీ, సినిమాని థియేటర్లలో చూస్తేనే అసలు సిసలు కిక్కు లభిస్తుంది. కానీ, ఏం చేస్తాం.? కరోనా కారణంగా థియేటర్లకు వెళ్ళే పరిస్థితి లేదు మరి. సో, ప్రస్తుతానికి ఓటీటీనే దిక్కు.