Jr NTR Ram Charan RRR Friendship యంగ్ టైగర్ ఎన్టీయార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఈ ఇద్దరూ కలిసి నటించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. కథ విషయంలో రాజమౌళి ఎంత కసరత్తు చేసి వుండాలి.? రామ్ చరణ్, ఎన్టీయార్.. ఈ ప్రాజెక్టు కోసం ఎంతలా ఆలోచించి వుండాలి.?
చరణ్ అయినా, ఎన్టీయార్ అయినా ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసే స్టామినా వున్న స్టార్ హీరోలు.
అలాంటిది, జక్కన్న రాజమౌళి అడగ్గానే బల్క్ డేట్స్ ఇచ్చి పడేశారు. కోవిడ్ పాండమిక్ అడ్డమొచ్చినా.. సినిమా కోసం కష్టపడి పని చేశారు.
అసలు ఈ సినిమా ఆలోచన రాకముందే తామిద్దరం మంచి స్నేహితులం మొర్రో.. అంటూ ఇద్దరూ మొత్తుకుంటున్నా, మీడియా స్పెక్యులేషన్స్ మాత్రం ఇద్దరిపైనా నెగెటివ్‌గానే వెళుతున్నాయి.
కొన్ని మెదళ్ళు అలా విషం నింపేసుకున్నాయంతే.!
సినిమా విడుదలకు ముందు నానా రకాల ఛండాలం సినిమా మీద వేసెయ్యాలని సోకాల్డ్ మీడియా ప్రయత్నించింది.
కానీ, ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ చలించలేదు. చరణ్, ఎన్టీయార్, రాజమౌళి.. తమ పని తాము చేసుకుపోయారు. సినిమా విడుదలయ్యింది.. సూపర్ హిట్టయ్యింది.
అయినాగానీ, సోకాల్డ్ మీడియా కక్కుర్తి చల్లారలేదు.. అసహనం తగ్గడంలేదు.
Jr NTR Ram Charan RRR Friendship ఎవరెక్కువ.? ఎవరు తక్కువ.?
ఎన్టీయార్ కంటే చరణ్ పాత్రకు ఎక్కువ ఇంపార్టెన్స్ దర్శకుడు రాజమౌళి ఇచ్చాడంటూ.. కథనాలు, వాటితోపాటుగా ఆ ముగ్గురి ముందే ప్రశ్నలూ.!
‘అదేం లేదు..’ అని చరణ్ చెప్పినా, ఎన్టీయార్ కూడా అదే మాట చెప్పినా, రాజమౌళి కూడా చెబుతున్నా.. ‘తగ్గేదేలే.. విషం చిమ్మడం ఆపేదే లే..’ అంటోంది చెత్త మీడియా. ఇలాగైతే, మల్టీస్టారర్ సినిమాలు ఇకపై వస్తాయా.?
Also Read: నయనతార.! ఊ అంటావా.? ఉలిక్కి పడతావా.?
అన్ని లెక్కలూ వేసుకుని, ఇద్దరి స్టార్‌డమ్ పరిగణనలోకి తీసుకుని, సమతూకంలో సినిమా తీస్తేనే ఇలా వుంటే.. ఒకరి పాత్ర నిడివి ఎక్కువ, ఇంకొకరి పాత్ర నిడివి తక్కువ వుండే కథలొస్తే ఏంటి పరిస్థితి.?
అసలు అలాంటివాటిని రానిస్తారా.? ఛాన్సే లేదు. చరణ్ మీద ద్వేషంతో ఎన్టీయార్ మీద కపట ప్రేమ కొందరు ప్రదర్శిస్తున్నారుగానీ.. అంతిమంగా వాళ్ళంతా కలిసి తెలుగు సినిమాని చంపేస్తున్నారన్నది నిష్టురసత్యం.