Home » డేంజరస్ గేమ్ ఆడుతున్నావ్ నానీ.!

డేంజరస్ గేమ్ ఆడుతున్నావ్ నానీ.!

by hellomudra
0 comments
Nani Hit3

Nani Hit3 Dangerous Game.. నేచురల్ స్టార్ నాని, డేంజరస్ గేమ్ ఆడుతున్నాడు. ఔను, నిజంగానే చాలా చాలా డేంజరస్ గేమ్ ఆడుతున్నాడు.!

ఎంచుకున్న కాన్సెప్ట్ అలాంటిది మరి.! అందుకే, ఆ కాన్సెప్ట్‌ని ఇంకా డేంజరస్‌గా ప్రమోట్ చేసుకోక తప్పడంలేదు. ఇదంతా నాని తాజా సినిమా ‘హిట్-3’ గురించే.

‘హిట్’ ఫ్రాంచైజీలో మూడో సినిమా ఈ ‘హిట్-3’. క్రైమ్ థ్రిల్లర్స్ కాబట్టి, హింస మామూలే.! ‘హిట్’, ‘హిట్2’ సినిమాల్లోని వయొలెన్స్ గురించి కొత్తగా చెప్పేదేముంది.?

Nani Hit3 Dangerous Game.. ప్రమోషన్లు కూడా భయానకంగానే..

సైకోలతో డీల్ చేసే పోలీస్ కథే, ఈ హిట్ ఫ్రాంచైజీలో కీలక పాయింట్. ఈసారి సైకో, మరింత డేంజరస్ అన్నమాట.! అందుకే, హీరో నాని కూడా రక్తంలో తడవక తప్పడంలేదు.

నిజానికి, ‘దసరా’ సినిమాలోనే, నాని రక్తంతో తడిసిపోయాడు. ఆ సినిమాలో విలన్, ఎంత క్రూరుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్నేహితుడ్ని కోల్పోయిన నాని, విలన్‌ని అత్యంత కిరాతకంగానే అంతమొందిస్తాడు.

Also Read: హరి హర వీర మల్లు.! ఎలా పవన్ కళ్యాణ్.. ఇదెలా సాధ్యం.?

విలన్ రాక్షసత్వానికి హీరో అలా ముగింపు పలకక తప్పలేదు. హింస, రక్తపాతం వున్నా.. ‘దసరా’ వ్యవహారం వేరు. స్నేహం, ప్రేమ.. అన్నీ వుంటాయ్.

మరి, ‘హిట్-3’ పరిస్థితి ఏంటి.? ‘హిట్-3’ కథా కమామిషు తెలియాలంటే సినిమా విడుదలయ్యేదాకా వేచి చూడాల్సిందే. కానీ, ఈలోగా ప్రమోషన్స్ జరుగుతున్న తీరు మాత్రం వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయ్.

Nani Hit3
Nani Hit3

జుగుప్సాకరమైన రీతిలో, రక్తపాతం కనిపిస్తోంది. చివరికి మీడియా ఇంటర్వ్యూల్లోనూ ఆ రక్తపాతాన్నే హైలైట్ చేస్తున్నారు. సినిమా కోసం వేసిన సెట్‌లో ఇంటర్వ్యూలు డిజైన్ చేశారు.

కత్తులు, రక్తం.. ఇదీ, ఇంటర్వ్యూలు జరిగే ప్రాంతంలో సీన్. మేకర్స్ ఇంటెన్షన్ చాలా స్పష్టంగా వుంది. దాన్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారన్నదే మిలియన్ డాలర్ క్వశ్చన్.

నానికి వున్న అభిమానుల్లో, మెజార్టీ.. హింసని ఇష్టపడనివారే. మరి, కొంతమందిని టార్గెట్ చేసుకుని, భారీ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న నాని.. ఎలా సక్సెస్ అవుతాడన్నది వేచి చూడాల్సిందే.

You may also like

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group