Jr NTR Sakthi.. యంగ్ టైగర్ ఎన్టీయార్ నటించిన ‘శక్తి’ సినిమా గుర్తుందా.? ఆయన అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని సినిమా అది. అంత పెద్ద డిజాస్టర్ మరి.!
నిజానికి, ఎన్టీయార్ కెరీర్‌లో ఫ్లాప్ సినిమాలు బాగానే వున్నాయ్. అందులోనూ కొన్ని డిజాస్టర్లూ లేకపోలేదు. ‘నా అల్లుడు’ లాంటి డిజాస్టర్లు వున్నా, ‘శక్తి’ రేంజ్ వేరే.!
ఇలియానా హీరోయిన్‌గా నటించిన ‘శక్తి’ సినిమా కోసం భారీగా ఖర్చు చేసేశారు. మెహర్ రమేష్ దర్శకుడు ఈ చిత్రానికి.!
Jr NTR Sakthi.. 32 కోట్ల నష్టమట.!
అసలు ‘శక్తి’ సినిమాకి ఎంత ఖర్చు పెట్టారు.? 25 కోట్లకు మించి నష్టం ఎలా వస్తుంది.? ఓ ఇంటర్వ్యూలో నిర్మాత అశ్వనీదత్ 25 కోట్ల నష్టమన్నాడు.
మరో ఇంటర్వ్యూలో అయితే, పాతిక కోట్లు కాదు.. 32 కోట్లు నష్టం.. అంటూ ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఆ పాత గాయాన్ని అశ్వనీదత్ ఇంకోసారి రేపడం, యంగ్ టైగర్ ఎన్టీయార్ అభిమానులకు అస్సలు నచ్చడంలేదు.
సోషల్ ట్రోలింగ్..
ఈ మధ్య సినిమాలు ఫ్లాప్ అయితే, ఆయా హీరోల్ని ఇతర హీరోల అభిమానులు మరీ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీయార్ అభిమానులకి ప్రత్యర్థి హీరోల అభిమానుల నుంచి ర్యాగింగ్ ఎక్కువైపోయింది ‘శక్తి’ సినిమా విషయమై.
Also Read: నాన్నంటే నరకం: బాంబు పేల్చిన సీనియర్ నటి ఖుష్బూ!
దాంతో, యంగ్ టైగర్ ఎన్టీయార్ అభిమానులు అశ్వనీదత్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అశ్వనీదత్ టీడీపీ నేత. ఆ టీడీపీలో జూనియర్ ఎన్టీయార్‌కి అస్సలు గౌరవం దక్కట్లేదు.
చంద్రబాబు మనిషి అయిన అశ్వనీదత్, యంగ్ టైగర్ ఎన్టీయార్ ఇమేజ్‌ని తక్కువ చేసి చూపేందుకే, ‘శక్తి’ ప్రస్తావన తెస్తున్నాడన్నది ప్రధాన ఆరోపణ.
‘శక్తి’ వల్ల తీవ్రంగా నష్టపోయిన తాను, అసలు జీవితంలో మళ్ళీ సినిమాలు నిర్మించకూడదనేంత డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయినట్లు అశ్వనీదత్ చెబుతున్నారంటే, మనసులో బలమైన కారణం, వ్యూహం వుండే వుంటాయ్.!
