Junior Nandamuri Taraka Ramarao.. ఆయనేదో తన సినిమాలు తాను చేసుకుంటూ వెళుతున్నాడు. నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.
అలాంటి జూనియర్ ఎన్టీయార్‌ని రాజకీయాల్లోకి ఎందుకు లాగుతున్నట్టు.? నిజానికి, ఎవరూ ఆయన్ని రాజకీయాల్లోకి లాగలేదు. ఆయనే రాజకీయాల్లోకి వచ్చాడు.
అది, 2009 ఎన్నికల సందర్భం. తెలుగుదేశం పార్టీ తరఫున జూనియర్ ఎన్టీయార్ ఎన్నికల ప్రచారం చేశాడు. స్వర్గీయ ఎన్టీయార్‌లా కనిపించేందుకు ఖాకీ దుస్తులు ధరించాడు కూడా.!
Junior Nandamuri Taraka Ramarao తప్పదు, భరించాల్సిందే.!
ఇప్పటికిప్పుడు జూనియర్ ఎన్టీయార్ రాజకీయాల్లోకి వచ్చేయాలా.? అంటే, ఏం.. ఎందుకు రాకూడదు.! యువతరం రాజకీయాల్లోకి రావాల్సిందే. అలాగే ఎన్టీయార్ కూడా రావొచ్చు.
నటుడిగా జూనియర్ ఎన్టీయార్ బిజీగా వున్నాడు. ఔను, అదీ నిజమే. కానీ, ‘బాధ్యత’ కోణంలో చూస్తే, ఆయనా రాజకీయాల్లోకి రావొచ్చు. రావాల్సిందే కూడా.!

రాజకీయాల్లోకి జూనియర్ ఎన్టీయార్ వస్తే ఏమవుతుంది.? ఇప్పుడేమో రమ్మంటారు.. వచ్చాక, నానా రకాల రాజకీయ విమర్శలూ చేస్తారు. చిరంజీవి విషయంలో, పవన్ కళ్యాణ్ విషయంలో ఏం జరిగిందో చూశాం.
బాలయ్య లెక్క వేరు. ఆయన జస్ట్ రాజకీయాల్లో వున్నాడంతే. తెలుగుదేశం పార్టీలో ఓ ఎమ్మెల్యే ఆయన. అంతకు మించి, రాజకీయ నాయకుడిగా తనదైన ప్రత్యేకతను ఆయన చాటుకున్నదేమీ లేదు.
టీడీపీ పగ్గాలు జూనియర్ ఎన్టీయార్ చేపట్టేయాలా.?
తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ చేతుల్లో వుంది. అది తిరిగి నందమూరి కుటుంబం చేతుల్లోకి రావడం దాదాపు అసాధ్యం. వస్తే, జూనియర్ ఎన్టీయార్ చేతికే రావాలి.
Also Read: పవన్ అభిమానుల మాల ధారణ.! వాళ్ళకి బాగా కాలినట్టుందే.!
సినిమాలు వదిలేసి, జూనియర్ ఎన్టీయార్ తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టాలనుకున్నాగానీ.. స్వర్గీయ ఎన్టీయార్‌ని టీడీపీకి దూరం చేసిన చంద్రబాబు, యంగ్ టైగర్‌ని ఆల్రెడీ ఓ సారి దూరం చేసిన చంద్రబాబు, ఇంకోసారి ఆ పని చేయలేరా.?
సంకటమే, ఇది నిజంగానే చాలా పెద్ద సంకటం యంగ్ టైగర్ ఎన్టీయార్‌కి. ‘తాత ఎన్టీయార్..’ అని గట్టిగా చెప్పుకుంటే సరిపోదు. ఆ తాత ఆశయాల్ని నిలబెట్టాలి. కానీ, అందుకు పరిస్థితులు అనుకూలించొద్దూ.? అత ధైర్యం, తెగువ వుండొద్దూ.?