Kajal Agarwal Acharya.. ‘మగధీర (Magadheera)’ సినిమాలో శ్రీ హరి నటించిన కొన్ని కీలక సన్నివేశాల్ని ఫైనల్ ఎడిట్ సందర్భంగా లేపేశారు. కానీ, ఆ తర్వాత వాటిని సినిమాకి జోడించారు.
అంత మంచి సీన్స్‌ని ఎందుకు తొలగించారు.? అని చాలా మంది అనుకున్నారు అప్పట్లో ‘మగధీర’ సినిమా గురించి.
‘ఆర్ఆర్ఆర్ (RRR Movie)’ సినిమా విషయంలో కూడా కొన్ని కత్తిరింపులు తప్పలేదు. ఈ విషయమై రచ్చ కొనసాగుతూనే వుంది.
‘సైరా నరసింహారెడ్డి’ కోసం ఓ పాట చిత్రీకరించాలనుకున్నారు. ఆడియోలో వచ్చింది కానీ, వీడియో విడుదల కాలేదు.
‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak) సినిమాలో కూడా ఓ పాటను పక్కన పెట్టాల్సి వచ్చింది. చెప్పుకుంటూ పోతే, ఇలాంటివి చాలానే కనిపిస్తాయ్. ఎందుకిలా.?
అసలు కత్తిరింపులు ఎందుకు.?
ఫైనల్ కట్ చూశాకా, ఏది మంచి.? ఏది చెడు.? అన్నదానిపై అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాల ఫలితమే అది. ఆ నిర్ణయం ఒక్కోసారి తప్పు కావచ్చు. ఒక్కోసారి రైట్ కావచ్చు.
అలాగే, ‘ఆచార్య (Acharya)’ నుంచి కాజల్ అగర్వాల్ పాత్రని తొలగించడం కూడా.
అంతకు ముందు ఈ పాత్రలో త్రిష (Trisha) నటించాల్సి వుంది. చివరి నిముషంలో త్రిషను తప్పించి, కాజల్ (Kajal Agarwal) ని ఎంపిక చేశారు.
ఇప్పుడు ఆ కాజల్ పాత్రని కూడా లేపేశారు. దాంతో కాజల్‌కి అన్యాయం జరిగిపోయిందనీ, సో కాల్డ్ మేథావులు దుష్ప్రచారం మొదలు పెట్టారు.
Kajal Agarwal Acharya.. కొరటాల ఏమంటున్నాడంటే..
అయితే, చిరంజీవి పక్కన జోడీగా కాజల్ అగర్వాల్‌ని అనుకున్నా కానీ, కొన్ని ఈక్వేషన్స్ సెట్ కాకపోవడం వల్ల ఆ పాత్రని తొలగించాల్సి వచ్చిందట.
ఆ విషయాన్నే కాజల్ అగర్వాల్‌కి చెప్పి ఒప్పించామనీ దర్శకుడు కొరటాల శివ (Koratala Shiva) వివరణ ఇచ్చారు.
కాజల్ (Kajal Agarwal) కూడా పరిస్థితిని అర్ధం చేసుకుంది. ఎందుకంటే, మెగా కాంపౌండ్‌తో ఆమెకి చాలా ప్రత్యేకమైన అనుబంధం వుంది.
మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) రీ ఎంట్రీలో చేసిన తొలి సినిమా ‘ఖైదీ నెంబర్ 150’లో హీరోయిన్ కాజల్ అగర్వాల్.
Also Read: నయనతార.! ఊ అంటావా.? ఉలిక్కి పడతావా.?
రామ్ చరణ్ (Ram Charan) తో ‘మగధీర’, ‘నాయక్’ తదితర సినిమాల్లో నటించింది. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)తో ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ సినిమాలో నటించింది.
ఏమో, భవిష్యత్తులో కాజల్, చిరంజీవితో కలిసి సినిమాలు చేసే అవకాశం లేకపోలేదేమో.