Kajal Aggarwal Satyabhama.. వామ్మో.. అలా చితక్కొట్టేసిందేంటీ.? నిజంగానే కాదు లెండి.! సినిమా కోసం.! పోలీస్ అధికారి ఆమె.
ఓ దొంగ, పోలీసు విచారణలో నిజాలు చెప్పకపోవడంతో, ‘మగ’ పోలీసులకు చేతకాని పనిని, శివంగిలా చేసేసింది కాజల్ అగర్వాల్.
వామ్మో.. కాజల్ అగర్వాల్‌లో ఈ యాంగిల్ కూడా వుందా.? నిజానికి, ఆమెకు పోలీస్ గెటప్ కొత్తేమీ కాదు.! కాకపోతే, ఈసారి లెక్క వేరే.!
Kajal Aggarwal Satyabhama.. సత్యభామతో మామూలుగా వుండదు మరి..
కాజల్ తన తాజా చిత్రం కోసం ‘సత్యభామ’ అవతారమెత్తింది. చీరకట్టులో పోలీస్ స్టేషన్‌కి నడుచుకుంటూ వచ్చి, కస్టడీలో వున్న క్రిమినల్ తాట తీసేసింది.
ఈ క్రమంలో ఆమె చేతికి వున్న గాజులు పగిలిపోయాయ్.. కొన్ని గుచ్చుకున్నాయ్ కూడా ఆమెకి.!

‘గాజులు తీసి కొట్టొచ్చు కదా.?’ అంటే, ‘అవి లేకుండా కొట్టారు కదా.? నిజం చెప్పాడా.?’ అంటూ మగ పోలీసుల్ని ఎటకారం చేస్తుంది సత్యభామ.
Also Read: Allu Arjun Sreeleela AHA.. ఆహాహా.! అర్జున్ లీల.! ఏంటీ గోల.?
అఖిల్ డేగల ఈ చిత్రానికి దర్శకుడు. శశికిరణ్ తిక్కా ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. కాజల్ అరవయ్యవ చిత్రమిది.

అందాల చందమామ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్ విడుదల చేశారు.
పెళ్ళయ్యాక.. ఓ బిడ్డకు తల్లయ్యాక.. కాజల్ రెట్టించిన ఉత్సాహంతో.. కెరీర్‌లో మరింత జోరు ప్రదర్శించేందుకు సిద్ధమైంది.