Kamal Haasan Pan India.. ప్రతి సినిమాకీ ‘పాన్ ఇండియా’ ట్యాగ్ తగిలించేయడం ఇటీవల ఫ్యాషన్ అయిపోయింది. ‘బాహుబలి’ సినిమాతో మొదలైంది ఈ కొత్త ‘పాన్’ ఇండియా పైత్యం.
అసలంటూ పాన్ ఇండియా గురించి మాట్లాడుకోవాలంటే.. ఆ కథ ఎప్పుడో మొదలైంది. నాగార్జున నటించిన ‘క్రిమినల్’ హిందీలోనూ, తెలుగులోనూ ఆడింది. చిరంజీవి, వెంకటేష్ తదితరులూ హిందీ సినిమాల్లో ప్రయత్నించారు.
చిరంజీవి హీరోగా నటించిన ‘ఘరానామొగుడు’ సినిమాకి ఫిదా అయిపోయాడు బాలీవుడ్ హీరో అనిల్ కపూర్. రజనీకాంత్, కమల్ హాసన్ ఎప్పుడో పాన్ ఇండియా సినిమాలు చేసేశారు.
Kamal Haasan Pan India.. వన్ అండ్ ఓన్లీ కమల్ హాసన్.!
అందునా, కమల్ హాసన్ అంటే.. నిఖార్సయిన పాన్ ఇండియా హీరో. ‘కమల్ హాసన్ తొలి పాన్ ఇండియా స్టార్..’ అంటూ తాజాగా విక్టరీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ నిజం.
అప్పుడెవరూ ‘మేం పాన్ ఇండియా మొనగాళ్ళం..’ అని చెప్పుకోలేదు. వారికి ఆ ట్యాగ్ కూడా ఎవరూ తగిలించలేదు.

కానీ, ఆ పైత్యం ఈ మధ్యనే మొదలైంది. ఆ పైత్యం మొదలయ్యాకనే టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్.. అన్న తేడాలు ఇంకా పెరిగిపోయాయ్.
దర్శకుడు శంకర్ కూడా పాన్ ఇండియా డైరెక్టరే. మణిరత్నం గురించి కొత్తగా చెప్పేదేముంది.? చెప్పుకుంటూ పోతే, ఇదో పెద్ద కథ.
పాన్ ఇండియా.. ఇదో బూటకం.!
అసలు పాన్ ఇండియా సినిమా అన్నదే బూటకపు మాట అనీ, ఇండియన్ సినిమా.. అందులో వివిధ ప్రాంతీయ చిత్రాలు.. అంతే తేడా.. అని సినీ రంగంలో సుదీర్ఘ అనుభవం వున్న ఫిలిం మేకర్స్ చెబుతుంటారు.
కమల్ హాసన్ కంటే పోటుగాళ్ళెవరన్న ప్రశ్న వస్తే, అదిగో తెలుగు సినిమాని, తెలుగు హీరోల్నీ తక్కువ చేసి మాట్లాడతారా.? అన్న ఎదురు ప్రశ్న రావొచ్చు.
Also Read: అడివి శేష్ ఏదో ’కథ‘ చెప్తున్నాడు.. సన్నీలియోన్ వింటోందా.?
కమల్ హాసన్ చేసినన్ని విభినమైన సినిమాలు.. ఆయన పోషించినన్ని విభిన్నమైన పాత్రలు.. దేశంలో ఏ నటుడికీ సాధ్యం కాదు. దటీజ్ కమల్ హాసన్.