Kangana Ranaut Dhaakad.. అహంకారానికి నిలువెత్తు నిదర్శనంగా బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ గురించి చెప్పుకోవచ్చు.
‘క్వీన్’ వంటి అత్యద్భుతమైన సినిమాల్లో తనదైన నటనా ప్రతిభతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కంగనా రనౌత్, బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ మాత్రమే కాదు.. తోటి నటీనటుల్ని కించపర్చడంలో మాస్టర్ డిగ్రీ కూడా చేసేసింది.
అందుకే, కంగనా రనౌత్ తాజా సినిమా ‘ధాకడ్’ మీద విపరీతమైన నెగెటివిటీ ఎక్కడ చూసినా కనిపిస్తోంది. ఇంతకు ముందెన్నడూ లేని నెగిటివిటీ.. అని అనలేంగానీ, ఈసారి ఇంకాస్త ప్రత్యేకం.! అంతే తేడా.
Kangana Ranaut Dhaakad.. కథ ముగిసిపోయిందంతే.!
‘ధాకడ్’ సినిమా కథా కమామిషు ఏంటి.? అన్న విషయాల్ని పక్కన పెడితే, సినిమాకి చాలా చాలా పూర్ ఓపెనింగ్స్ వచ్చాయి. అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే, మరీ దారుణంగా వున్నాయని బాలీవుడ్ ట్రేడ్ పండితులు అంటున్నారు.
అదేంటీ, కంగన మన తెలుగు సినీ పరిశ్రమని, సౌత్ సినిమాని అత్యద్భుతంగా కొనియాడింది కదా.? అంటే, ఎవర్నో విమర్శించడానికి ఇంకెవర్నో పొగడటం కంగనా రనౌత్‌కి అలవాటే. అదే చేసిందామె.

సౌత్ సినిమా మీద గతంలో కంగన (Kangana Ranaut) చేసిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడామె స్వరం మారింది. కాదు కాదు, మార్చుకుంది.
అంతా స్వయంకృతాపరాధమే.!
తోటి హీరోయిన్లను గ్రేడ్ల వారీగా విభజిస్తూ, ఆయా హీరోయిన్లపై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేస్తుంటుంది కంగనా రనౌత్. ఆయా హీరోయిన్ల అభిమానులంతా ఇప్పుడు కంగన మీద ‘కసి’ తీర్చుకుంటున్నారు, ‘ధాకడ్’ ఫ్లాప్ నేపథ్యంలో.
ఇంతకీ, ‘ధాకడ్’ (Dhaakad Movie) తర్వాత కంగన ‘గ్రేడ్ ఎంతవరకు పడిపోయింది.? అంటే, ‘సీ-గ్రేడ్’ కంటే దిగువన.. అనే అభిప్రాయం సోషల్ మీడియాలో వ్యక్తమవుతోంది.
Also Read: పాన్ ఇండియా పైత్యమా.! గౌరవం కాదు, అవమానమా.!
తాప్సీ లాంటి సక్సెస్‌ఫుల్ నటీమణుల్ని ‘సి-గ్రేడ్’, ‘బి-గ్రేడ్’ అని ఇదే కంగనా రనౌత్ అభివర్ణించింది.
అక్కడికేదో తాను నిజ జీవితంలోనూ మహారాణిననీ, మిగతావాళ్ళంతా.. అంటే, హీరోయిన్లు చెలికత్తెల్లాంటోళ్ళో.. సేవకులనో అనుకున్నట్టుంది కంగన. ఇప్పుడేమో, ఫ్లాపొచ్చేసరికి కంగన గ్రేడ్ జీరో అయిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
చేసుకున్నోళ్ళకి చేసుకున్నంత.. అంటే ఇదే మరి.