Kangana Ranaut Emergency.. భారతదేశం ఉక్కు మహిళ ఇందిర గాంధీ హయాంలో ఎమర్జన్సీని చవిచూసింది. ఎమర్జన్సీ అంటే ప్రజాస్వామ్యానికి సంబంధించి అదొక దారుణం.!
ఔను, కాంగ్రెస్ నేతల్లోనూ చాలామంది ఎమర్జన్సీని అప్పట్లోనే వ్యతిరేకించారు. ఎమర్జన్సీ అసలెందుకు పెట్టారు.? దాని పర్యవసానాలు ఏంటి.? అన్నది వేరే చర్చ.
కానీ, ఎమర్జన్సీ కాంగ్రెస్ చరిత్రలో ఓ మాయని మచ్చ. ఆనాటి ఎమర్జనీ పరిస్థితుల్ని ఎదుర్కొన్న చాలామంది ఇప్పటికీ ఆ ‘కాళరాత్రుల్ని’ మర్చిపోలేరు.!
Kangana Ranaut Emergency.. కంగనా రనౌత్ ఎమర్జన్సీ వెనుక.!
ఆనాటి ఆ ‘ఎమర్జన్సీ’ ఇప్పుడు సినిమా రూపంలో మన ముందుకు రాబోతోంది. బాలీవుడ్ నటి కంగన రనౌత్, ఉక్కు మహిళ ఇందిర పాత్రలో కనిపించబోతోంది.

తాజాగా కంగన ‘ఎమర్జన్సీ’ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ లుక్ రివీల్ చేశారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమాలు తరచూ వస్తున్నాయి.
అందునా, కంగన (Kangana Ranaut) నుంచి పొలిటికల్ టచ్ వున్న సినిమాలు ఎక్కువగా వస్తుండడం విశేషమే మరి. మొన్నామధ్య కంగన ‘తలైవి’ సినిమా చేసిన సంగతి తెలిసిందే.
ఎమర్జన్సీ రాజకాయం.!
కంగన రనౌత్ బీజేపీ మనిషి. ఇది ఓపెన్ సీక్రెట్. ఆమె ఏదన్నా సినిమా చేస్తే, అందులో కమర్షియల్ అంశాల సంగతెలా వున్నా, బీజేపీకి కలిసొచ్చే అంశాల గురించి ఎక్కువగా ఆలోచిస్తోంది.
Also Read: అడివి శేష్ ఏదో ’కథ‘ చెప్తున్నాడు.. సన్నీలియోన్ వింటోందా.?
సో, కంగన నుంచి వస్తోన్న ‘ఎమర్జన్సీ’ (Kangana Emergency) సినిమాలో బీజేపీ కోసం పనికొచ్చే అంశాలు, అదే సమయంలో కాంగ్రెస్ పార్టీని పాతరేసే అంశాలు చాలానే వుండబోతున్నాయ్.
సరే, సినిమాని రాజకీయ కోణంలో చూడటం ఎంతవరకు సబబు.? అన్నది వేరే చర్చ. అసలంటూ సినిమాలే పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంటోంటే, రాజకీయాలు మాట్లాడకూదనడం సబబు కాదు కదా.!
ఏది ఏమైనా, ఎమర్జన్సీ నాటి పరిస్థితులు.. అప్పుడు ప్రజలెదుర్కొన్న ఇబ్బందులు.. మీడియా సైతం భరించిన కష్టాలు.. ఇవన్నీ నేటి తరానికి తెలియాల్సిన అవసరం వుంది.
మన పొరుగు దేశాల్లో ఎమర్జన్సీ గురించి మనం తరచూ వింటున్నాం. ఈ నేపథ్యంలో మన దేశంలో ఎమర్జన్సీ సంగతేంటి.? అదెలా వస్తుంది.? దాని వల్ల కలిగిన నష్టమెంత.?
ఇవన్నీ కంగన ‘ఎమర్జన్సీ’ సినిమాలో నిజాయితీగా చూపిస్తారని ఆశించగలమా.? కేవలం రాజకీయానికే దీన్ని పరిమితం చేస్తారా.? వేచి చూడాల్సిందే.