Kangana Ranaut Marriage.. తెలివితేటలంటే అలా వుండాలి.! అందుకే కంగనా రనౌత్, ఆ స్థాయిలో వుంది. క్వీన్ కంగనా రనౌత్, నటనలోనే కాదు, వివాదాస్పద వ్యాఖ్యల్లోనూ దిట్ట. అంతకు మించి, ఆమె చాలా తెలివైంది.!
ఇప్పడీ కంగనా రనౌత్ తెలివితేటల గురించిన చర్చ ఎందుకంటారా.? కంగనా రనౌత్‌కి పెళ్ళి కాకపోవడంపై కొందరు మీడియా ప్రతినిథులు ఆమె వద్దనే తెగ ఇదయిపోయారు. దానికి ఆమె కౌంటర్ ఎటాక్ ఇవ్వాల్సిన స్థాయిలోనే ఇచ్చేసింది.
కంగనా రనౌత్‌తో పెట్టుకుంటే అలాగే వుంటుంది మరి.! నా పెళ్ళికి అడ్డంకి మీరేనంటూ మీడియా మీద గుస్సా అయ్యింది క్వీన్ కంగన.
Kangana Ranaut Marriage.. మీడియా ఏం చేసింది ఫాఫం.!
నిజానికి, కంగనా రనౌత్ అంటే మంచి నటి అని కాదు, ఆమె వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అనే ఎక్కువ పాపులర్. ఔను, ప్రతి చిన్న విషయంలోనూ వివాదాన్ని వెతుక్కునే రకం కంగనా రనౌత్.
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన కంగనా రనౌత్‌కి మగాళ్ళంటే గిట్టదు కూడా.!

ఈ విషయంలో చాలామంది మగాళ్ళతో పేచీ పెట్టుకుంది. అలాగని, ఆడాళ్ళను వదిలిందా.? బి-గ్రేడ్, సి-గ్రేడ్ నటీమణులంటూ తోటి హీరోయిన్లను అవహేళన చేసింది.
అవలక్షణాలన్నీ తనలో పెట్టుకుని, తనకు పెళ్ళి కాకుండా మీడియానే, తన మీద దుష్ప్రచారం చేసిందని కంగన వాపోతుందేంటో.! అదే మరి కంగన అతి తెలివి అంటే.
ఇంతకీ, కంగన రనౌత్ పెళ్ళెప్పుడు.?
ఆ ఒక్కటీ అడక్కూడదంతే.! అయినా, మీడియా అడ్డుపడితే మాత్రం కంగనా రనౌత్ పెళ్ళి ఆగిపోతుందా.? మీడియా కంటపడకుండా గతంలో కంగన నడిపిన ఎఫైర్ల సంగతేంటి.?
టామ్ బాయ్ ఇమేజ్ కూడా కంగన కొనితెచ్చుకున్నదే. ఆ ఇమేజ్ తనకు చాలా నచ్చిందని గతంలో పలు సార్లు కంగన చెప్పిది కూడా.
Also Read: నిహారిక కూడా మీ ‘ఆడకూతురు’ లాంటిదే కదా.!
ఇప్పుడు మీడియానే తనకు టామ్ బాయ్ ఇమేజ్ అంటగట్టిందనీ, అందుకే తనకు పెళ్ళి అవడంలేదని చెబుతోంది ఈ బ్యూటీ.
మామూలు ముదురు కాదు.! కంగన రనౌత్ (Kangana Ranaut) అంటే దేశ ముదురు మరి.!