Kavya Kalyanram Body Shaming.. ఎవరీ అమ్మాయ్.? పలు తెలుగు సినిమాల్లో బాల నటిగా కనిపించి.. ఇప్పుడు హీరోయిన్‌గా ప్రమోట్ అయిన కావ్య కళ్యాణ్‌రామ్.!
ఈ మధ్యనే, ‘బలగం’ సినిమాతో నటిగా ఆకట్టుకుంది. హీరోయిన్‌గా ప్రమోట్ అవుతూనే మంచి హిట్టు కొట్టింది. అందరి దృష్టినీ ఆకర్షించింది కూడా.!
ఇంతలోనే, వివాదాస్పదంగా వార్తల్లోకెక్కింది. ఏవో పుకార్లు.. ఆమెను వార్తల్లోకి ఎక్కేలా చేశాయ్. అది కూడా బాడీ షేమింగ్ సంబంధిత వ్యవహారం.
Kavya Kalyanram Body Shaming.. తూచ్.. నేనలా అన్లేదు.!
సినీ సెలబ్రిటీలు ఏమీ అనక్కర్లేదు. అలా అన్నారని పుకార్లు పుట్టేస్తున్న రోజులివి. తిరిగి, వాటికి ఖండన ప్రకటనల్ని ఆయా సెలబ్రిటీలు ఇచ్చుకోవాల్సిన దుస్థితి.

ఓ దర్శకుడు, కావ్య కళ్యాణ్‌రామ్ (Kavya Kalyanram) విషయంలో బాడీ షేమింగ్‌కి పాల్పడ్డాడన్నది పుట్టుకొచ్చిన పుకార్ల సారాంశం.
కాస్త బొద్దుగా వుంటుంది కదా.. ఇకనేం, గాలి వార్తల్ని పోగేసేశారు కొందరు.. ఆమె పర్సనాలిటీకి సంబంధించి. దాంతో, కావ్య కళ్యాణ్‌రామ్ అప్రమత్తమయ్యింది.
Also Read: న్యూసూ న్యూసెన్సూ! ఎనకటి రెడ్డిగాడి పెళ్ళాం లేచిపోయిందట!
తన మీద జరుగుతున్నదంతా దుష్ప్రచారమేనని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్న కావ్య, సినీ పరిశ్రమలో తానింతవరకూ బాడీ షేమింగ్ ఎదుర్కొన్నది లేదని చెప్పింది.
ప్చ్.. ఇలా చెప్పుకోవాల్సి రావడం కావ్య కళ్యాణ్‌రామ్‌కి (Kavya Kalyanram) ఎంత కష్టమో కదా.!
ఆమె చేసింది తక్కువ సినిమాలే.. ఈ నేపథ్యంలో ఆయా దర్శకుల మీద కూడా ఈ గాసిప్స్ కారణంగా లేనిపోని బురద చల్లేసినట్లయ్యింది.