KCR BRS Telangana Elections.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. తక్షణమే తెలంగాణలో ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చేసింది.
పార్టీ పేరులోని తెలంగాణ స్థానంలో భారత్ వచ్చి చేరింది.. ఇదే గులాబీ పార్టీలో ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న అతి పెద్ద మార్పు.
ఇప్పుడు గులాబీ పార్టీ అంటే, జాతీయ పార్టీ.! జాతీయ రాజకీయాల్ని శాసిస్తామంటోంది కేసీయార్ నేతృత్వంలోని గులాబీ దళం.
ముందైతే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి చూపించండి.. ఆ తర్వాత జాతీయ రాజకీయాల గురించి మాట్లాడొచ్చంటూ రాజకీయ ప్రత్యర్థుల నుంచి బీఆర్ఎస్ పార్టీకి సవాళ్ళు ఎదురవుతున్నాయ్.
KCR BRS Telangana Elections.. తెలంగాణలో గులాబీ జెండా.. హ్యాట్రిక్ సాధ్యమేనా.?
ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా, తెలంగాణలో కేసీయార్‌కి ధీటుగా నిలబడే నాయకుడు, ఇతర రాజకీయ పార్టీల్లో లేరన్నది నిర్వివాదాంశం.
రేవంత్ రెడ్డి కావొచ్చు, బండి సంజయ్ కావొచ్చు.. ఇంకొకరు కావొచ్చు, వీళ్ళని ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ఆయా పార్టీలు (అంటే కాంగ్రెస్, బీజేపీ) ప్రకటించే పరిస్థితి ప్రస్తుతానికి లేదు.
మజ్లిస్ ఎలాగూ భారత్ రాష్ట్ర సమితికి మిత్రపక్షమే.! వరుసగా రెండు సార్లు అధికార పీఠమెక్కిన కేసీయార్, ఈసారి కూడా గెలిచి, హ్యాట్రిక్ కొడ్తారన్నది గులాబీ పార్టీ ధీమా.
కేసీయార్.. ఆ రికార్డు కొల్లగొట్టగలరా.?
దక్షిణాదిన ఏ రాజకీయ నాయకుడు కూడా ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్ కొట్టలేదనీ, ఆ రికార్డు కేసీయార్‌కే సాధ్యమవుతుందని కేసీయార్ తనయుడు కేటీయార్ జోస్యం చెబుతున్న సంగతి తెలిసిందే.
రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే.! అదే సమయంలో, రాజకీయ సమీకరణాలు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయ్.
పార్టీ పేరులోని ‘తెలంగాణ’నే గులాబీ పార్టీకి అసలు సిసలు బలం.! ఆ ‘తెలంగాణ’ ఇప్పుడు లేదాయె.!
Also Read: ప్రకాష్ రాజ్‌కి ఝలక్ ఇచ్చిన కంగనా రనౌత్.!
పేరులోనేముంది.? తెలంగాణ సెంటిమెంటుకి కేరాఫ్ అడ్రస్ కేసీయార్.. ఆ సెంటిమెంటు తాలూకు సర్వ హక్కులూ కేసీయార్‌కే సొంతం.. అంటోంది గులాబీ పార్టీ.!
చూద్దాం.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరగబోతోందో.! నవంబర్ 30న పోలింగ్, డిసెంబర్ 3న కౌంటింగ్.! ఆ డిసెంబర్ 3న అన్ని లెక్కలూ తేలిపోతాయ్.!