Table of Contents
Keerthy Suresh Love.. మీకు తెలుసా.? కీర్తి సురేష్ పెళ్లయిపోయిందట. విడాకులు కూడానట. కీర్తికి ఓ ప్రముఖ నటుడితో లవ్ ఎఫైర్ అట.!
ఓ సంగీత దర్శకుడితో డేటింగ్ కూడా చేస్తోందంట. చిన్ననాటి స్నేహితుడితో దశాబ్ధ కాలానికి పైగా కీర్తి లవ్‌లో వుందట. ఏంటీ ఇవన్నీ నిజాలేనా.?
‘నేను శైలజ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ కీర్తి సురేష్. తొలి సినిమాకే హీరోయిన్‌గా తన టాలెంట్ ఏంటో చూపించేసింది.
Keerthy Suresh Love.. కెరీర్ డల్ అయితే, పెళ్లేనా.?
ఆ తర్వాత ‘మహానటి’ సినిమాతో కెరీర్ ఎక్కడికో వెళ్లిపోయింది. మహానటి కీర్తిసురేష్ అంటూ కీర్తించుకుంటోంది. తెలుగు, తమిళ, ఇప్పుడు హిందీ భాషల్లోనూ కీర్తి సురేష్ పాపులారిటీ దక్కించుకుంది.
అయితే, గత కొన్నాళ్లుగా కీర్తి సురేష్ ప్రొఫిషనల్ లైఫ్ ఏమంత బాగా లేదు. కానీ, పర్సనల్ లైఫ్ మాత్రం ట్విస్టుల మీద ట్విస్టులు.

సినిమా కథలను మించి, ఇంట్రెస్టింగ్ ట్విస్టులు కీర్తి సురేష్ పర్సనల్ లైఫ్‌లో జరుగుతున్నాయ్. ముఖ్యంగా మహానటి ప్రేమ గురించి ఈ మధ్య వచ్చిన కథనాలు భలే ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయ్‌లే.
ప్రొఫిషనల్ లైఫ్ డల్ అయ్యే సరికి కీర్తి సురేష్ పెళ్లి వార్త జోరుగా దూసుకొచ్చింది. తూచ్.! అదంతా వుత్తదే.. అని కీర్తి ఖండించిందనుకోండి.
మహానటి కదా.. ఆ మాత్రం వుండాల.!
అయినా తగ్గేదే లే.! కీర్తి సురేష్ తమిళ దర్శకుడు అనిరుధ్‌తో పీకల్లోతు ప్రేమాయణం సాగిస్తోందట.. అంటూ ఓ వార్త. కాదు కాదు, తమిళ స్టార్ హీరోని వల్లో పడేసుకుందట.
ఆయన మరెవరో కాదు, స్టార్ హీరో విజయ్ అనీ, ఆయనతో కొన్నాళ్లుగా మహానటి డేటింగ్‌లో వుందనీ ఇంకో వార్త. తాజాగా కీర్తి సురేష్ చిన్ననాటి స్నేహితుడ్ని పెళ్లి చేసుకోబోతోందట.. ఇదో వార్త.
ఇంకాస్త రీసెర్చ్‌లోకెళితే, గత పదమూడేళ్లుగా తన చిన్ననాటి స్నేహితుడ్ని ప్రేమిస్తోందట. ఆయనకు సినిమాలతో టచ్ లేదట. హోటల్ మేనేజ్‌మెంట్ చేస్తున్నారట. బిజినెస్‌మేన్ అన్నమాట.
ఆ వ్యక్తినే కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోతోందట. అయితే అందుకు ఇంకాస్త టైముందట.. అని తాజాగా ఇంకో న్యూస్ చక్కర్లు కొడుతోంది.
తూచ్.! అదంతా వుత్తదే.!
వామ్మో.! ఓ హీరోయిన్‌పై మరీ ఇన్ని రూమర్లా.? ఆగండాగండి అక్కడితో ఆగితేనేగా.! కీర్తి సురేష్‌కి ఆల్రెడీ పెళ్లయిపోయిందట. త్వరలో విడాకులట.! ఇదీ కొత్త గాచిప్.!
పోలా.! అదిరిపోలా.! మరోవైపు నాకేమంత వయసైపోయిందనీ, నాలుగేళ్ల వరకూ పెళ్లి చేసుకునే వుద్దేశ్యం లేదనీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది.
Also Read: Sapthami Gowda.. ‘కాంతా.! రా.!’ రమ్మంటున్నారు.!
ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో సినిమాలు బాగానే వున్నాయ్. వాటితో పాటూ, మరిన్ని కొత్త ప్రాజెక్టులను టేకప్ చేసే దిశగా కీర్తి సురేష్ అడుగులు వేస్తోంది.
అదేంటో.! ఈ టైమ్‌లో మహానటిపై ఈ సిల్లీ రూమర్సేంటో.! పిచ్చ కామెడీ కాకపోతేనూ.!