Table of Contents
Keerthy Suresh Luck.. వామ్మో.! వాడో పెద్ద ఐరెన్ లెగ్గురా బాబూ.. అంటూ కొందరికి ‘దురదృష్టం’ అనే ట్యాగ్‌ని బలవంతంగా అడ్రస్ చేసేస్తూ వుంటాం. నిజంగానే ‘అన్‌లక్’ అనేది వుంటుందా.? ఐరెన్ లెగ్ వుంటుందా.? ఏమో పాత తెలుగు సినిమాల్లో ఓ క్యారెక్టర్ అలా క్రియేట్ అయ్యింది. జస్ట్ ఫర్ ఫన్. అప్పట్లో ఆ క్యారెక్టర్ చాలా ఫేమస్ కూడా.
ఇంతకీ ఇప్పుడీ ఐరెన్ లెగ్ టాపిక్ ఎందుకంటారా.? ‘మహానటి’ సినిమాతో గొప్ప కీర్తి ప్రతిష్టలు దక్కించుకున్న హీరోయిన్ కీర్తి సురేష్ గురించి. ఆమె నటించిన ‘గుడ్ లక్ సఖి’ సినిమా గురించి. టైటిల్‌లో వున్న గుడ్ లక్ పాపం హీరోయిన్ లైఫ్‌లో వుండదు. సో, అంతా ఆమెను బ్యాడ్ లక్ సఖి అని ఏడిపిస్తుంటారు.
కీర్తి ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుందా.?
సరే, అది సినిమా ముచ్చట అనుకోండి. ఏ ముహూర్తాన ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ (బ్యాడ్ లక్ గాళ్) ని క్రియేట్ చేశారో కానీ, పాపం ఈ సినిమా అనుకున్నప్పటి నుండీ కీర్తి సురేష్‌కి బ్యాడ్ లక్ నడుస్తూనే వుందట. సూపర్ డూపర్ హిట్ అయిన ‘మహానటి’ సినిమా తర్వాత కీర్తి సురేష్ ఒప్పుకున్న సినిమా అట ఇది.
తెలిసిందే కదా.. ‘మహానటి’ తర్వాత అదేంటో.. ఒక్క హిట్ కూడా కీర్తి సురేష్ ఖాతాలో పడలేదు. ‘మహానటి’ తర్వాత ‘మిస్ ఇండియా’, ‘పెంగ్విన్’, రంగ్ దే’.. అంటూ వరుస పెట్టి సినిమాలు చేసేసింది. వాటిలో కొన్ని ఎప్పుడొచ్చి, ఎప్పుడెళ్లిపోయాయో కూడా తెలీదు.
Keerthy Suresh Luck.. ఆ పొరపాట్లే కొంప ముంచేస్తున్నాయ్..
కథల ఎంపికలో కీర్తి సురేష్ చాలా చాలా పొరపాట్లు చేస్తోంది.. అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు ఆమె అభిమాన గళం. బోలెడంత టాలెంట్ వుంది. తన స్థాయికి తగ్గ సినిమాల్ని ఎంచుకోకపోతే, ‘మహానటి’ క్రేజ్ భారీగా డ్యామేజ్ అయిపోతుందని స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చేస్తున్నారు.

ఇకపోతే, ‘గుడ్ లక్ సఖి’ సినిమాకి సంబంధించిన ప్రమోషన్లలో మాట్లాడుతూ, తనను నిజంగానే ‘బ్యాడ్ లక్ సఖి’ అని గతంలో అనేవారని కీర్తి సురేష్ బాహాటంగానే చెప్పుకుంది. నిజంగా అన్నారో లేదో తెలీదు కానీ, సినిమా ప్రమోషన్స్‌కి తన బ్యాడ్ లక్ స్టోరీని బాగా వాడేసుకుంది కీర్తి సురేష్.
కెరీర్ తొలి నాళ్ళలో ‘ఐరన్ లెగ్.. బ్యాడ్ లక్ బ్యూటీ..’ అనే విమర్శల్ని ఎదుర్కొందట ఈ బ్యూటీ. కానీ, ఆ తర్వాత సక్సెస్ మీద సక్సెస్ రావడంతో.. తన రేంజ్ మారిపోయిందని కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది. ఈ స్టోరీ సింపథీ రిలీజ్‌కి ముందు బాగానే వర్కవుట్ అయ్యిందేమో కానీ, రిలీజ్ తర్వాత దారుణంగా నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చేసింది.
ఇలాగైతే కష్టమే మహానటీ.!
ఇంకా మించిపోయిందేమీ లేదు. కీర్తి సురేష్ చేతిలో ఇప్పటికే ‘సర్కారు వారి పాట’, ‘భోళా శంకర్’ రూపంలో రెండు భారీ ప్రాజెక్టులున్నాయ్. ‘సర్కారు వారి పాట’ సినిమా కోసం తొలిసారిగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కీర్తి జత కడుతున్న సంగతి తెల్సిందే.
Also Read: చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప.. ఈ భ్రష్టత్వం ఎవరిదప్పా.!
ఇక, మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న ‘భోళాశంకర్’ సినిమాలో చిరంజీవి సోదరి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. మొన్న ‘పెద్దన్న’ సినిమా కోసం రజనీకాంత్ చెల్లెలిగా నటించి, ఇప్పుడు ‘భోళాశంకర్ కోసం’ చిరంజీవి చెల్లెలిగా నటించనుండడం విశేషమే మరి.
