Keerthy Suresh Dasara.. నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘దసరా’ సినిమాలో కీర్తి సురేష్ పాత్రపై షాకింగ్ గాసిప్ ప్రచారంలో వుంది.
ఎలాంటి పాత్ర అయినా, అవలీలగా మెప్పించేయగల టాలెంట్ వున్న ముద్దుగుమ్మ కీర్తి సురేష్. అందుకే మహానటి సావిత్రినే తన టాలెంట్‌తో రీప్లేస్ చేసేసింది ‘మహానటి’ సినిమాతో కీర్తి సురేష్.
అయితే, ‘దసరా’ సినిమాలో కీర్తి సురేష్ పాత్రకు సంబంధించి జరుగుతున్న ప్రచారం ఒకింత ఆసక్తి కలిగిస్తోంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ పాత్రను చంపేస్తారన్నదే ఆ ప్రచారం తాలూకు సారాంశం.
‘దసరా’ సినిమా కథ లీక్ అయిపోయిందట.! ఇదొక రివెంజ్ డ్రామా అట.!
Mudra369
హీరోయిన్ కీర్తి సురేష్ పాత్ర చనిపోతుందట.!
కాదు కాదు, ఓ చిన్నమ్మాయ్ చుట్టూ కథ నడుస్తుందట.
ఆమె హత్యకు గురవుతుందట. ఆమె హత్యకు ప్రతీకారం తీర్చుకుంటాడట హీరో.! బాబోయ్ ఎన్నెన్ని గాసిప్పులో.!
అదేంటీ.! మెయిన్ లీడ్ హీరోయిన్ కదా.! చంపేస్తే ఎలా.? తెలుగు ఆడియన్స్ ఆ అంశాన్ని డైజెస్ట్ చేసుకోగలరా.? అంటూ రకరకాల అనుమానాలు తలెత్తుతున్నాయ్.
Keerthy Suresh Dasara ఆ స్థాయిలో కథ డిమాండ్ చేస్తే.!
అయితే, ‘దసరా’ సినిమాని తెలుగుతో పాటూ పలు ఇతర భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నారు. ప్యాన్ ఇండియా వైడ్‌గా ఈ సినిమాపై అంచనాలున్నాయ్.
కానీ, కీర్తి సురేష్ పాత్ర సినిమాలోని కథకు అలా డిమాండ్ చేసిందట. ఆమె పాత్రను చంపేస్తేనే సెంటిమెంట్ ఆ స్థాయిలో కనెక్ట్ అవుతుందనీ, అందుకే ఆ పాత్రను చంపేయాల్సి వస్తుందనీ ఓ ప్రచారం తెరపైకొచ్చింది.

కథ ఎంత డిమాండ్ చేసినా, హీరోయిన్ పాత్రను చంపేస్తే ఆ రిజల్ట్ ఎలా వుంటుందో ఏమో చెప్పలేం. ఒకవేళ వర్కవుట్ అయితే ‘దసరా’కి బ్లాక్ బస్టర్ పండగే మరి. ఇంతకీ ఇదంతా నిజమేనా.?
గాసిప్పులకేం.. ఎడా పెడా పుట్టుకొచ్చేస్తాయ్. ఇవి ఒక్కోసారి సినిమాకి ప్లస్సవుతాయ్.. కొన్ని సందర్భాల్లో సినిమాని ముంచేస్తాయ్ కూడా.!
Also Read: Guess Who: జలకాలాటాల్లో ఎవరీ అందాల ‘చిరుత’.!
మరోవైపు నాని, ఈ సినిమా విజయంపై చాలా చాలా కాన్ఫిడెంట్‌గా వున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా రేంజ్‌లో ఈ సినిమాపై అంచనాలు క్రియేట్ చేస్తున్నాడు.
చూడాలి మరి, ఏం జరుగుతుందో.! కొత్త డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే.