Keerthy Suresh Saree మలయాళ కుట్టీ కీర్తి సురేష్ యాక్టింగ్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సౌత్ ప్రేక్షకుల్ని ‘మహానటి’గా అలరిస్తోంది తన టాలెంట్‌తో కీర్తి సురేష్.
అయితే, మొదట్లో గ్లామర్‌కి దూరంగా వుండే కీర్తి సురేష్ (Keerthy Suresh), ఈ మధ్య ఆ లోటు కూడా తీర్చేసింది. ఎప్పుడయితే సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటించిందో.. అప్పటి నుంచీ కీర్తిలో చాలా మార్పు వచ్చింది.
మార్పు మంచిదే కదా.. కేవలం చాలెంజింగ్ రోల్సే కాదు, గ్లామర్ రోల్స్‌తోనూ కేక పుట్టిస్తోంది. కమర్షియల్ హీరోయిన్‌గా టర్న్ తీసుకుంది.
కమర్షియల్ టర్న్ కలిసొచ్చేనా.?
దాంతో, కీర్తి సురేష్‌కి ఆఫర్లు కూడా పోటెత్తుతున్నాయనుకోండి. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘భోళా శంకర్’ సినిమాలో నటిస్తోంది కీర్తి సురేష్.

అయితే, ఈ సినిమాలో కీర్తికి పెద్దగా గ్లామర్ టచ్ వుండకపోవచ్చు. సిస్టర్ రోల్ కాబట్టి. ఇక, ‘దసరా’ సినిమా కోసం నానితో కీర్తి సురేష్ జత కట్టింది.
ఈ సినిమాలో కీర్తి పాత్ర చాలా కొత్తగా వుండబోతోందట. ప్రచార చిత్రాలను బట్టి వింటేజ్ లుక్స్‌లో కనిపిస్తోంది కీర్తి సురేష్.
Keerthy Suresh Saree కీర్తి సురేష్ గ్లామర్ ‘మంత్ర’.!
అయితే, ఇకపై కనిపించే సినిమాల్లో కీర్తి సురేష్ (Keerthy Suresh) గ్లామరస్ పాత్రలను కూడా ఎంచుకోబోతోందనీ తెలుస్తోంది. అందాకా తనలోని గ్లామర్ యాంగిల్స్‌ని ఫ్యాన్స్‌కి పరిచయం చేస్తోంది సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా.
Also Read: Sania Mirza.. గ్లామరస్ టెన్నిస్.. అంతకు మించి.!
తాజాగా బ్లాక్ కలర్ శారీలో కీర్తి సురేష్ కొన్ని ఫోటోలు నెట్టింట్లో పోస్ట్ చేసింది. కనీ కనిపించని అందాలతో గ్లామర్ మ్యాజిక్ చేస్తోంది. ఈ ఫొటోలు వైరల్‌గా మారాయ్. అభిమానులకు కిర్రాకు పుట్టిస్తున్నాయ్.

అందాల మంత్రగత్తెలా కనిపిస్తోంది ఈ కాస్ట్యూమ్స్‌లో కీర్తి సురేష్. కీర్తి గ్లామర్ మాయాజాలానికి ఎంతటి నిగ్రహమున్నా కుర్రకారు గుండె బేజారైపోవాల్సిందే.!