Keerthy Suresh.. మెగాస్టార్ చిరంజీవితో కలిసి డాన్స్ చేయడమంటే మాటలు కాదు.! కానీ, ఆ మెగాస్టార్ చిరంజీవిని కాలితో తొక్కేసింది పలు మార్లు హీరోయిన్ రంభ.
‘తాను ఎంతలా చిరంజీవిని ఇబ్బంది పెట్టినా, ఆయన మాత్రం స్పోర్టివ్‌గానే తీసుకున్నారు..’ అంటూ రంభ ‘హిట్లర్’ సినిమాలోని ‘అబీబీ’ సాంగ్ గురించి వీలు చిక్కినప్పుడల్లా చెబుతుంటుంది.
‘ఆంటీ కూతురా.. అమ్మో అప్సరా..’ అంటూ ‘బావగారూ బాగున్నారా’ సినిమాలోని పాట విషయంలోనూ ఇలాంటి ‘తొక్కుడు’ సంఘటనలు జరిగాయట.. వాటిని చిరంజీవి లైట్ తీసుకున్నారట.
Keerthy Suresh.. అప్పుడు రంభ, ఇప్పుడు కీర్తి సురేష్.!
ఇప్పుడు దాదాపు అదే తరహా కామెంట్స్, మహా నటి కీర్తి సురేష్ నుంచి వినిపిస్తున్నాయి.. అదీ సూపర్ స్టార్ మహేష్ గురించి.
‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata) సినిమా కోసం తొలిసారిగా సూపర్ స్టార్ మహేష్‌బాబుతో జత కడుతున్న కీర్తి సురేష్, ఈ సినిమాలో పాటల చిత్రీకరణ సమయంలో అనుకోకుండా మహేష్ మొహానికి తన చెయ్యి పదే పదే తగిలిందని చెప్పుకొచ్చింది.
‘సూపర్ స్టార్ మహేష్ బాబు మొహమ్మీద కొట్టిన మహానటి కీర్తి సురేష్..’ అంటూ సోషల్ మీడియాలో ఈ టాపిక్ వైరల్ అవుతోంది.
మహేష్ సూపర్ గ్రేట్: కీర్తి సురేష్
మహేష్ లాంటి సూపర్ స్టార్, షూటింగ్ సమయంలో అనుకోకుండా జరిగిన ఘటనల్ని లైట్ తీసుకోవడం తనను ఆశ్చర్యరపరిచిందని అంటోంది మహానటి కీర్తి సురేష్.
ఇదిలా వుంటే, ఇటు మహేష్.. అటు కీర్తి సురేష్.. ఇద్దరూ ‘సర్కారు వారి పాట’ సినిమా కోసం డాన్సుల్లో ఒకరితో ఒకరు పోటీ పడ్డారట. ఈ విషయాన్ని డాన్స్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ చెప్పుకొచ్చారు తాజాగా ఓ ఇంటర్వ్యూలో.
Also Read: Janhvi Kapoor ‘Go Slow’ గ్లామర్ సీక్రెట్ ఇదే.!
మహేష్ (Super Star Maheshbabu), కీర్తి సురేష్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన ‘సర్కారు వారి పాట’ విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే.