విజయ్ దేవరకొండ ఆకలి.! వేట మొదలు పెట్టిన ‘లైగర్’.!

 విజయ్ దేవరకొండ ఆకలి.! వేట మొదలు పెట్టిన ‘లైగర్’.!

Vijay Deverakonda Liger

Vijay Deverakonda Liger.. ‘మా అవకాశం కోసం ఎంతో ఓపికగా ఎదురు చూస్తున్నాం.. మా సమయం వచ్చింది.. దేశం ముందు మా సత్తా చాటేందుకు సిద్ధంగా వున్నాం..’ అంటూ రౌడీ హీరో, ‘లైగర్’ విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన పోస్ట్ పెట్టాడు.

విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.

రౌడీ హీరోకి ఇది తొలి పాన్ ఇండియా సినిమా. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే (Ananya Panday) ఈ సినిమాలో విజయ్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది.

ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ ఈ ‘లైగర్’ (Liger) సినిమాలో కీలక పాత్ర పోషించడం గమనార్హం. ఛార్మి, పూరి జగన్నాథ్ (Puri Jagannath) సంయుక్తంగా ఈ ‘లైగర్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Vijay Deverakonda Liger ఆకలితో వున్నాడు.!

‘నేను ఆకలితో వున్నాను.. ఇండియా ఆకలితో వున్నాను.. సమయం వచ్చేసింది..’ అంటూ విజయ్ దేవరకొండ ట్వీటేయగా, ఆ ట్వీట్ వైరల్ అయ్యింది.

బాక్సింగ్ నేపథ్యంలో లైగర్ సినిమా తెరకెక్కుతోంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు నటీనటులు, సాంకేతిక నిపుణులు ‘లైగర్’ కోసం పని చేశారు.

కోవిడ్ పాండమిక్ లేకపోయి వుంటే, ‘లైగర్’ (Liger Movie) ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు వచ్చేసి వుండేది.

టాలీవుడ్ నుంచి వస్తోన్న మరో పాన్ ఇండియా సినిమా కావడంతో ‘లైగర్’ (Liger Film) గురించి దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

పాన్ ఇండియా ‘లైగర్’ వేట.!

విజయ్ దేవరకొండకి తెలుగులోనే కాదు, తమిళ, కన్నడ, సినీ పరిశ్రమల్లోనూ మంచి ఫాలోయింగ్ వుంది. గతంలో ‘నోటా’ సినిమాతోనే తన మార్కెట్‌ని గణనీయంగా పెంచుకున్నాడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda).

Also Read: నిహారిక కూడా మీ ‘ఆడకూతురు’ లాంటిదే కదా.!

‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ (KGF Chapter 2) తరహాలో, అంతకు మించిన స్థాయిలో ‘లైగర్’ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడం ఖాయమని రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Rowdy Vijay Deverakonda) అభిమానులు భావిస్తున్నారు.

Digiqole Ad

Related post