Keerthy Suresh.. పరశురామ్ దర్శకత్వంలో మహేష్‌బాబు హీరోగా తెరకెక్కిన ‘సర్కారు వారి పాట’ సినిమాలో హీరోయిన్‌గా కీర్తి సురేష్ నటించిన సంగతి తెలిసిందే. ‘కళావతి’ పాత్రలో తళుక్కున మెరిసింది కీర్తి సురేష్ ఈ సినిమాలో.
ఇంతకీ, ‘సర్కారు వారి పాట’ సినిమాతో కీర్తి సురేష్‌కి లాభమెంత.? సినిమాకి డిజాస్టర్ టాక్ వచ్చింది.. అదే టాక్ కొనసాగుతూనే వుంది. ఇంకోపక్క, వసూళ్ళ జాతర.. అంటూ ప్రచారం జరుగుతోంది.
సినిమా హిట్టయ్యిందా.? ఫట్టయ్యిందా.? అన్న విషయాన్ని పక్కన పెడితే, సినిమాలో కీర్తి సురేష్ పాత్ర గురించి పెద్దగా చర్చ జరగడంలేదు. కీర్తి సురేష్‌కి ఈ సినిమా వల్ల అస్సలేమాత్రం లాభం లేదన్న ప్రచారమైతే జరుగుతోంది.
Keerthy Suresh కాకపోతే ఇంకెవరు.?
కీర్తి సురేష్ కాకుండా ‘సర్కారు వారి పాట’ సినిమాలో ఇంకో గ్లామరస్ హీరోయిన్ ఎవరైనా నటించి వుంటే, ఆ సినిమా పలితం మరోలా వుండేదన్నది మెజార్టీ అభిప్రాయం. మహేష్ అభిమానులే ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

అయితే, మహేష్ – కీర్తి కాంబినేషన్ రిఫ్రెషింగ్‌గా వుందనేవారూ లేకపోలేదు. ఒక్కటైతే నిజం, చాన్నాళ్ళ తర్వాత కీర్తి సురేష్ పేరు మార్మోగిపోయేలా ఓ గ్లామరస్ చర్చ అయితే ‘సర్కారు వారి పాట’ సినిమాతో జరుగుతోంది.
‘చిన్ని’లో అలా, ‘సర్కారు వారి పాట’లో ఇలా.!
తొలిసారిగా ఈ సినిమాలో ఒకింత గ్లామర్ ఒలకబోయేసింది కీర్తి సురేష్. అన్నట్టు, ‘సర్కారు వారి పాట’ సినిమా విడుదలకు కొద్ది రోజుల ముందే, ఓటీటీలో కీర్తి సురేష్ నటించిన ‘చిన్ని’ సినిమా వచ్చింది.
‘చిన్ని’లో కీర్తి సురేష్ పూర్తి డీ గ్లామర్ రోల్ చేసిన సంగతి తెల్సిందే. పూర్తి సీరియస్ క్యారెక్టర్ ఆ సినిమాలో కీర్తి సురేష్ చేసింది. నటిగా ఫుల్ మార్క్స్ కొట్టేసింది.
నటన పరంగా చూసుకుంటే, ‘సర్కారు వారి పాట’ సినిమాలో కీర్తి సురేష్‌కి మంచి మార్కులేమీ రాలేదనుకోండి.. అది వేరే సంగతి.
Also Read: Bigg Boss NON STOP బాగోతం.! సమాజానికి హానికరం.?
ఇదిలా వుంటే, ‘సర్కారు వారి పాట’ సినిమా తన కెరీర్‌లో వెరీ వెరీ స్పెషల్ ఫిలిం అంటోంది కీర్తి సురేష్.
సినిమా విజయం తనకు చాలా చాలా ఆనందాన్నిచ్చిందనీ, తన పాత్రకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయని కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది.