Keerthy Suresh Snake Jewellery.. మెడలో ఒక స్నేక్.. చేతికి ఇంకో స్నేక్.! అదీ, అస్సలేమాత్రం భయం లేకుండా.!
భయమెందుకు, అదేమన్నా నిజమైన స్నేక్ అనుకున్నారా.? కాదు కాదు. వజ్రాభరణాలు పొదిగినట్లున్న స్నేక్.!
ఓ జ్యుయెలరీ సంస్థ రూపొందించిన, స్నేక్ ఆభరరణాల్ని మెడలోనూ, చేతికీ ధరించింది ‘మహానటి’ కీర్తి సురేష్.! చేతి వేలికి ఉంగరంగానూ అదే స్నేక్ ఆభరణం.!
Keerthy Suresh Snake Jewellery.. అందం.. రెట్టింపయ్యింది.!
పెళ్ళికి ముందు కీర్తి సురేష్ వేరు. పెళ్ళయ్యాక కీర్తి సురేష్ వేరు.! ఔను, గ్లామర్ విషయంలో ఈ స్పష్టమైన తేడా అందరికీ కనిపిస్తోంది.!
ఆ కారణంగానే, కీర్తి సురేష్ మీద ట్రోలింగ్ కూడా ఓ రేంజ్‌లో జరుగుతోంది సోషల్ మీడియా వేదికగా. అఫ్‌కోర్స్, ఆ ట్రోలింగ్‌ని పట్టించుకునే రకం కాదు.. కీర్తి సురేష్.!

ఏమాటకామాటే చెప్పుకోవాలంటే, కీర్తి సురేష్ చూపులు.. ‘స్నేక్ బైట్’ కంటే, విషపూరితం.. అనుకోవచ్చేమో.. అంటున్నారు కొందరు నెటిజనం, భావుకతతో.!
అదీ నిజమే సుమీ.! కీర్తి సురేష్ కోర చూపుల ముందు, ఆ స్నేక్ జ్యుయెలరీ చిన్నబోయినట్లేనేమో.!
ప్యాన్ ఇండియా హీరోయిన్..
కీర్తి సురేష్ అంటే, ఇప్పుడు ప్యాన్ ఇండియా హీరోయిన్. కెరీర్‌లో కొంచెం వేగం తగ్గించిందిగానీ.. లేదంటే, బ్యాక్ టు బ్యాక్ రిలీజులు ఆమె నుంచి వుండేవే.
కథల ఎంపికలో తీసుకుంటున్న జాగ్రత్తలే, ఈ గ్యాప్‌కి కారణమన్నది కీర్తి సురేష్ చెబుతున్నమాట.! అది కూడా నిజమే.!
Also Read: దళిత వాడల్లో హిందూ దేవాలయాలపై షర్మిలకు భయమెందుకు.?
రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్ని ఈ మధ్య తగ్గించేసింది కీర్తి సురేష్. ఆ మాటకొస్తే, అలాంటివి చేయడంలేదు కూడా.!

ఏది ఏమైనా, పెళ్ళయ్యాక కీర్తి సురేష్ అనుసరిస్తున్న ఫ్యాషన్ ట్రెండ్స్ మాత్రం వేరే లెవల్ అంతే.!
సోషల్ మీడియాలో కీర్తి సురేష్ ఫ్యాషన్ ట్రెండ్స్ ఫొటోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే వున్నాయి. అందం చూడవయా.. ఆనందించవయా.!
