Ketika Shama Robinhood Surprise.. అదేం దిక్కుమాలిన స్టెప్పు.? పైగా, హుక్కు స్టెప్పు అంట.! బాగానే వైరల్ అయ్యిందిగానీ, పరమ ఛండాలంగా వుంది.!
ఎందుకొచ్చిన తంటా.. అనుకున్నాడో ఏమోగానీ, హీరో నితిన్.. ఆ స్టెప్పుకి కత్తిరింపులు వేయించేశాడట.! ఈ విషయంలో మైత్రీ మూవీ మేకర్స్‌ని కూడా అభినందించి తీరాలి.
అన్నట్టు, ఈ ‘అదిదా సర్‌ప్రైసు’ హుక్కు స్టెప్పుని విదేశాల్లో యధాతథంగా ‘ప్లే’ చేశారట. మన తెలుగు రాష్ట్రాల కోసమే, స్పెషల్‌గా ట్రిమ్మింగ్ చేశారని అంటున్నారు.
నితిన్, శ్రీలీల జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘రాబిన్ హుడ్’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. తొలుత ఈ సినిమా కోసం హీరోయిన్‌గా రష్మిక మండన్నని అనుకున్నారు.
రష్మిక డేట్స్ కుదరకపోవడంతో, ఆ ప్లేస్‌లోకి శ్రీలీల వచ్చింది. అది వేరే సంగతి.!
Ketika Shama Robinhood Surprise.. పీకేసి మంచి పనే చేశారా.?
సరే, సినిమా రిజల్ట్ ఎలా వుందన్న విషయాన్ని పక్కన పెడితే, కాంట్రవర్సీ అయిన దరిమిలా, హుక్ స్టెప్పుని లేపెయ్యడం అభినందించాల్సిన విషయమే.
వల్గర్ యాంగిల్‌ని పక్కన పెడితే, ‘రాబిన్ హుడ్’ కోసం చేసిన స్పెషల్ సాంగ్‌ని ప్రమోట్ చేసేందుకు కేతిక శర్మ చాలానే కష్టపడింది.
ప్చ్.. కేతిక శర్మ కష్టం వృధా అయిపోయిందని అనుకోవాలేమో.! అయినా, అంత వల్గర్ టచ్‌తో ఐటమ్ సాంగ్‌ని ఎలా డిజైన్ చేశారో ఏమో.!
ఆ పైత్యం తనదేనంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు వెంకీ కుడుముల చావు కబురు చల్లగా చెప్పాడు. షూట్ చేస్తున్నప్పుడు వల్గర్‌గా అనిపించలేదనీ అన్నాడు.
కానీ, వివాదం ముదిరి పాకాన పడిన దరిమిలా, నితిన్ అభిప్రాయంతో వెంకీ కుడుముల కూడా ఏకీభవించినట్లున్నాడు.. వెరసి, కేతిక శర్మ హుక్ స్టెప్పుకి ఆల్ట్రేషన్ జరిగింది.
ఇదిదా అసలు సిసలు సర్‌ప్రైసు.! అన్నట్టు, ‘అదిదా సర్‌ప్రైసు’ హుక్ స్టెప్పుని బిగ్ స్క్రీన్ మీద చూడాలనుకున్న ఓ వర్గం సినీ అభిమానులు బాగా డిజప్పాయింట్ అయ్యార్ట.!