Ketika Sharma.. కళ్ళలోనే హాట్ అప్పీల్ కేతిక శర్మ సొంతం.! కాదంటారా.? ఫొటో చూస్తోంటే అర్థం కావట్లేదూ.! నల్లా నల్లాని బొద్దుగుమ్మా.. అట్టాగ సూడమాకే.. అంటోంది కుర్రకారు.!
‘రొమాంటిక్’ (Romantic Movie) బ్యూటీ కేతికా శర్మకు సోషల్ మీడియాలో వున్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. తొలి సినిమా పేరునే తన పేరుకు ముందు ట్యాగ్‌లా మార్చేసుకుందీ ఢిల్లీ భామ.
పూరీ జగన్నాధ్ (Puri Jagannath) మార్క్ హీరోయిన్‌లా ప్రమోషన్లతో ఊదరగొట్టింది. కానీ, సినిమాలో పాపం ఈ పాపకి అంత సీనూ సినిమా దక్కలేదు.
అయినా రెండో ఛాన్స్ కొట్టేసింది. యంగ్ హీరో నాగ శౌర్య (Naga Shaurya) సరసన ‘లక్ష్య’ లో నటించింది. అయినా తాను అనుకున్న లక్ష్యాన్ని అందుకోలేకపోయింది అందాల కేతిక.
Ketika Sharma అందం రంగ రంగ వైభవమే.!
ముచ్చటగా మూడో ఛాన్స్ కోసం ఏకంగా మెగా కాంపౌండ్‌నే టచ్ చేసిందీ అమ్మడు. ‘రంగ రంగ వైభవంగా’ అంటూ పంజా వైష్ణవ్ తేజ్‌తో ఆన్ స్ర్కీన్ రొమాన్స్ చేసింది.

క్యూట్ అండ్ హాట్ అప్పీల్‌తో ఆకట్టుకుంది. కానీ, సినిమాకి ఆడియన్స్ నుంచి ఆశించిన రిజల్ట్ రాకపోవడంతో, రేస్‌లో వెనకే వుండిపోయింది.
బాగా సోషల్.!
డబ్ స్మాషర్‌గా అంతకు ముందే సోషల్ మీడియాకి గట్టి పరిచయస్తురాలైన కేతిక, సినిమాల్లో ఛాన్సులు అంతంత మాత్రమే అయ్యేసరికి ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే వెళ్లిపోయింది.
Also Read: Yummy Rakul.! అందాన్ని తింటోందేమో.!
అదేనండీ, సోషల్ మీడియాలో ఎప్పటిలాగే తన హల్‌చల్ మొదలెట్టేసింది. హీరోయిన్ మెటీరియల్ అనిపించుకుంది కదా.. నెక్స్‌ట్ లెవల్ గ్లామర్ అప్పీల్‌తో కుర్రోళ్ల మతులు పోగొడుతోందిప్పుడు.
ఆ నేపథ్యంలోనే బ్లాక్ అవుట్ ఫిట్‌లో రొమాంటిక్ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ పిచ్చెక్కిస్తోంది కేతికా శర్మ. హై నెక్ టాప్‌లో కేతికా అందాలకు కుర్రోళ్లు గుండె జారి గల్లంతయ్యిందే.! అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
అలా అభిమానుల్ని అలరించడానికే.. ఇలా అందమైన ఫొటోలతో సోషల్ మీడియాలో సందడి చేస్తుంటుంది కేతిక శర్మ.