Ketika Sharma Single Hit.. పూరీ కంపెనీ నుంచి టాలీవుడ్‌కి పరిచయమైన ముద్దుగుమ్మ కేతిక శర్మ.
అదేనండీ.! పూరీ జగన్నాధ్ తెరకెక్కించిన ‘రొమాంటిక్’ సినిమాలో ఆకాష్ పూరీ సరసన హాట్‌గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మే కేతిక శర్మ.
డెబ్యూ మూవీ ఫలించలేదు. తర్వాత ‘రంగ రంగ వైభవంగా’, ‘లక్ష్య’, ‘బ్రో’ తదితర సినిమా్ల్లో నటించింది.
కానీ, సో సో హీరోయిన్ మాత్రమే అనిపించుకుంది. ఇక, లేటెస్ట్‌గా ‘#’సింగిల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది.

ఈ సినిమాకి మంచి ఆదరణ దక్కుతోంది. శ్రీ విష్ణు హీరోగా వచ్చిన ఈ సినిమా హాట్ సమ్మర్‌లో కూల్ మూవీగా ధియేటర్లలో దూసుకెళ్తోంది.
దాంతో కేతిక ఖాతాలో ఎట్టకేలకు ఓ హిట్టు పడిందోచ్.. అని ఆమె అభిమానులు మురిసిపోతున్నారు.
Ketika Sharma Single Hit.. అదిదా సర్‌ప్రైజూ..!
ఇటీవలే నితిన్ హీరోగా వచ్చిన ‘రాబిన్ హుడ్’ సినిమా కోసం ‘అదిది సర్‌ప్రైజూ..’ అంటూ ఓ స్పెషల్ సాంగ్‌లో ఆడి పాడింది కేతిక శర్మ.
ఈ సాంగ్‌లో ఓ హుక్ స్టెప్ అభ్యంతరకరంగా వుందంటూ వివాదం చెలరేగగా సినిమాలో ఆ స్టెప్ తొలగించేసిన సంగతి తెలిసిందే.
అయితే, ఆ స్పెషల్ సాంగ్‌తో కేతికకు పెద్దగా ఒరిగిదేమీ లేదనుకోండి.

కానీ, ‘సింగిల్’ సినిమాలో సెటిల్డ్ పర్‌ఫామెన్స్ వున్న రోల్ దక్కింది కేతికా శర్మకి. ఆ పాత్రలో తనదైన పర్‌ఫామెన్స్‌తో ఆకట్టుకుంది.
సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో ఎట్టకేలకు కేతిక ఖాతాలో ఓ హిట్టు పడిపోయింది. అన్నట్లు ఈ రొమాంటిక్ బ్యూటీ బాలీవుడ్‌లోనూ ఓ సినిమాలో నటిస్తోందండోయ్. అదే ‘విజయ్ 69’.
Also Read: Thittam Irandu Telugu Review: కుడి ఎడమైతే.. పొరపాటు లేదోయ్.!
కలలు నెరవేర్చుకోవడానికి ఏజ్ లిమిట్ లేదన్న ట్యాగ్ లైన్‌తో ఈ సినిమా రూపొందుతోంది. సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ లీడ్ రోల్ పోషిస్తున్నాడు. కేతిక ఓ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తోంది.
ఇదిలా వుంటే, కేతిక ఖాతాలో ఓ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ చేరబోతున్నట్లు సమాచారం. ఓ స్టార్ హీరో సినిమాలో కేతిక శర్మకు ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయ్.
